Jagapathi Babu: వయసులో నా కంటె చిన్నవాడైనా ఆ స్టార్ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు

కొన్నేళ్ల క్రితం ముందు వరకు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ పరంగా చాలా స్ట్రగుల్ అయ్యారు జగపతిబాబు. హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే గోడకు కొట్టిన బంతిలా రీఎంట్రీ వరుస సినిమాలతో దూసుకపోతున్నారు జగ్గూభాయ్.

Jagapathi Babu: వయసులో నా కంటె చిన్నవాడైనా ఆ స్టార్ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు
Jagapathi Babu

Updated on: Nov 18, 2026 | 9:38 PM

జగపతిబాబు.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జగ్గూభాయ్. మొన్నటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలిగారాయన. వరుసగా కుటుంబ కథా చిత్రాలు చేస్తూ ఫ్యామిలీ హీరోగా తెలుగు ఆడియెన్స్ మనసుల్లో చెరగని గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మధ్యలో చాలా స్ట్రగుల్ అయ్యారు జగ్గూభాయ్. ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హీరోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అలాగే వ్యక్తిగత జీవితంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమాల ద్వారా సంపాదించిన కోట్లాది ఆస్తులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడని కూడా ప్రచారం జరిగింది. అయితే బాలకృష్ణ లెజెండ్ సినిమాతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారు జగపతిబాబు. అందులో పవర్ ఫుల్ విలన్ గా నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. దీని తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. విలన్ గా, సహాయక నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారాయన. పెద్ది, సలార్ వంటి వైపు పాన్‌ ఇండియా సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన జగపతి బాబు హీరోప్రభాస్‌, రాజమౌళి ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

‘ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌కి ఇతరులకు ఇవ్వడమే కానీ తిరిగి అడగడం తెలియదు. ఎవరెలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాడు. నేను ఓ సారి డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కి ఫోన్‌ చేసి మాట్లాడాలని అడిగాను. అప్పుడు అతను జార్జియాలో ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయినా నా ఫోన్ ఎత్తి.. ‘డార్లింగ్‌.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్‌ చెప్పు.. నేను తీరుస్తా’అని ధైర్యం చెప్పాడు. చెప్పినట్లుగానే జార్జియా నుంచి ఇక్కడకు రాగానే వచ్చి నన్ను కలిశాడు. ఆ సయమంలో ప్రభాస్‌ చెప్పిన మాటలు నాకు ఎంతో ఓదార్పు నిచ్చాయి. అలాగే ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. వయసులో నా కంటె చిన్నవాడైనా గొప్ప మనసు తనది. అందరిని ప్రేమగా ఆదరిస్తాడు’ అని డార్లింగ్ పై ప్రశంసలు కురిపించారు జగపతి బాబు

ఇవి కూడా చదవండి

ఇక ది గ్రేట్ రాజమౌళి గురించి మాట్లాడుతూ .. ‘ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించినా రాజమౌళిలో ఏ మాత్రం గర్వం కనిపించదు. ఒకరో ఇద్దరు కాదు ఆయన ఫ్యామిలీ అంతా అలానే ఉంటుంది. అందరిని ప్రేమగా చూసుకుంటారు. వాళ్లు హాలీడే ట్రిప్‌లో కూడా సినిమా గురించే ఆలోచిస్తాడు. నా చుట్టమే కదా అని తన సినిమాలో పాత్ర అడిగితే బాగోదు. రాజమౌళి కూడా అలా మొహమాటంతో తన సినిమాల్లో ఛాన్సులు ఇచ్చే వ్యక్తి కాదు. తన సినిమాలో పాత్రకు ఎవరు సెట్‌ అవుతారో వారినే ఎంపిక చేసుకుంటారు. సినిమా విషయంలో వాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకున్న చాలు.. జీవితంలో మనం సక్సెస్ అవుతాం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు జగ్గూ భాయ్.

Jagapathi Babu, Prabhas

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us