Top Folk Song: తెలుగు జానపద గేయాల్లో సంచలనం.. ఏకంగా 479 మిలియన్ల వ్యూస్..

తెలుగులో పల్లె పాటల్ని జనం భలే ఆదరిస్తారు. మంచి పదాలతో, కవిత్వంతో పాట రాస్తే.. శ్రోతలు ఆ సాంగ్‌కు పక్కాగా మిలియన్ల వ్యూస్ ఇచ్చేస్తారు. అలాంటి ఓ పాపులర్ సాంగ్‌ను ఈ రోజు మీ ముందుకు తెచ్చాం.. ఈ పాట వినగానే ఓ వైబ్ మొదలవుతుంది.

Top Folk Song: తెలుగు జానపద గేయాల్లో సంచలనం.. ఏకంగా 479 మిలియన్ల వ్యూస్..
Telugu Folk Song

Updated on: Feb 12, 2026 | 12:32 PM

తెలుగులో జానపద గేయాలకు ఎప్పుడూ సెపరేట్ రీచ్ ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ పాటలకు మిలియన్ల రీచ్ ఉంటుంది. జానాపదాలను ఇష్టపడే వాళ్లు అలా లూప్‌లో వింటూనే ఉంటారు. ఇప్పుడు మీ ముందుకు ఓ టాప్ వ్యూస్ ఉన్న ఫోక్ సాంగ్ తీసుకొచ్చాం. ఈ పాట అంటే చాలామందికి ప్రాణం. ఇంక దాచేది ఏముంది.. ఆ పాట మరేదో కాదు ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా…’. నాలుగేళ్ల క్రితం ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఆటోల్లో.. కార్లలో.. ఫంక్షన్లో మారుమోగిపోయింది. ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం సమకూర్చారు.  లక్ష్మణ్ లిరిక్స్ అందించగా..  సింగర్ మోహన భోగరాజు అద్భుతంగా ఆలపించారు. సినిమా పాటలు పాడుతున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోక్ సాంగ్స్‌తో కూడా అలరిస్తుంది ఈ గాయని. ఈ పాటకు యూట్యూబ్‌లో 479 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి అంటే.. సాంగ్ జనాల్లోకి ఎంతలా చొచ్చుకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. సాంగ్‌లోనిసాహిత్యం, పదాల కూర్పు, తెలంగాణతనం అందర్నీ కట్టిపడేశాయి.

ఈ పాట విజయం వెనుక ఈ బృందం సమిష్టి కృషి, సృజనాత్మకత ఉంది. ఇలాంటి పాటలు ప్రజలకు బాగా నచ్చుతాయని, భావోద్వేగాలతో కూడిన, సృజనాత్మక ఆలోచనలతో ఏదైనా సాధ్యమని బుల్లెట్టు బండి పాట నిరూపించింది. అనేక మంది ఈ పాటకు నృత్యాలు చేస్తూ, వీడియోలు రూపొందిస్తూ ఇప్పటికీ అప్‌లోడ్ చేస్తుండటం దీని కొనసాగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. బుల్లెట్టు బండి పాట తెలుగు ప్రేక్షకులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us