Urvashi Rautela: నిన్న వీడియో.. నేడు ఆడియో.. హాట్ టాపిక్‌గా మారిన ఊర్వశి రౌతేలా యవ్వారం..

| Edited By: Phani CH

Jul 18, 2024 | 4:52 PM

ఊర్వశి రౌతేలా బాత్‌రూమ్‌ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ఎలా లీక్ అయిందంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఊర్వశి రౌతేలా బాత్రూంలోకి వచ్చి తన బట్టలు విప్పుతూ కనిపించింది.. ఎవరో రహస్య కెమెరాతో షూట్ చేసినట్లుగా ఉంది ఈ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది. అయితే ఇది ఆమె పర్సనల్ వీడియో కాదని ఓ సినిమాలోని సీన్ అని తెలుస్తోంది.

Urvashi Rautela: నిన్న వీడియో.. నేడు ఆడియో.. హాట్ టాపిక్‌గా మారిన ఊర్వశి రౌతేలా యవ్వారం..
Urvashi Rautela
Follow us on

నటి ఊర్వశి రౌతేలా పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఊర్వశి పర్సనల్ వీడియో లీక్ అయింది. ఊర్వశి రౌతేలా బాత్‌రూమ్‌ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ఎలా లీక్ అయిందంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఊర్వశి రౌతేలా బాత్రూంలోకి వచ్చి తన బట్టలు విప్పుతూ కనిపించింది.. ఎవరో రహస్య కెమెరాతో షూట్ చేసినట్లుగా ఉంది ఈ వీడియో. ప్రస్తుతం ఈ వీడియో సర్వత్రా వైరల్ అవుతోంది. అయితే ఇది ఆమె పర్సనల్ వీడియో కాదని ఓ సినిమాలోని సీన్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఘటనపై ఊర్వశి మేనేజర్ స్పందించారు. ఇలాంటి వీడియోలు ఎలా లీక్ అవుతాయో నాకు తెలియదు. మేము ఈ వీడియోను సోషల్ మీడియా నుండి తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే, ఇప్పట్లో ఈ వీడియోను బ్రేక్ చేయడం సాధ్యం కాదు అని అన్నారు. అలాగే ఇప్పుడు ఊర్వశి ఈ వీడియో గురించి తన మేనేజర్ తో మాట్లాడుతున్న ఆడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈ ఆడియోలో తన వీడియో గురించి ఊర్వశి తన మేనేజర్ పై సీరియస్ అయ్యింది.“మీరు వీడియో చూశారా? ఈ విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను వెంటనే వారితో మాట్లాడాలి” అంటి సీరియస్ అయ్యింది ఊర్వశి.

అయితే దీని పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు

ఊర్వశి రౌతేలా క్రేజ్ ఉన్న హీరోయిన్. ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది . లీకైన వీడియో కూడా ప్రచారంలో భాగమేనని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు సరిగ్గా బట్టలు విప్పే సమయానికి వీడియో కట్ అవుతుంది. ఇది ఎలా సాధ్యం అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అలాగే కేవలం పబ్లిక్ అటెన్షన్ కోసమే ఆమె ఇలా చేస్తుందని , గతంలో పూనమ్ పాండే కూడా ఇలానే చేసిందని నెటిజన్స్ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.