‘బర్త్‌డే బాయ్‌’లకు మెగాస్టార్‌ స్పెషల్ విషెస్‌..రేర్‌ ఫొటోలు షేర్ చేసిన చిరు..!

| Edited By:

Apr 08, 2020 | 12:45 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని వారసుడు అకిల్, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇవాళ పుట్టినరోజులు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ముగ్గురికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో తీసుకున్న రేర్ ఫొటోలను మెగాస్టార్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. మొదట బన్నీకి విష్ చేసిన చిరు.. ”డ్యాన్స్‌లో గ్రేస్‌, ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. […]

బర్త్‌డే బాయ్‌లకు మెగాస్టార్‌ స్పెషల్ విషెస్‌..రేర్‌ ఫొటోలు షేర్ చేసిన చిరు..!
Follow us on

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని వారసుడు అకిల్, పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఇవాళ పుట్టినరోజులు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ ముగ్గురికి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో తీసుకున్న రేర్ ఫొటోలను మెగాస్టార్ అభిమానులతో షేర్ చేసుకున్నారు.

మొదట బన్నీకి విష్ చేసిన చిరు.. ”డ్యాన్స్‌లో గ్రేస్‌, ఆ వయస్సు నుంచే ఉంది. బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం. హ్యాపీ బర్త్‌డే బన్నీ నువ్వు బాగుండాలబ్బా” అని ట్వీట్ చేశారు.

ఇక అఖిల్ గురించి కామెంట్ చేస్తూ.. ”హ్యాపీ బర్త్‌డే అఖిల్. చరణ్‌కి ఒక తమ్ముడు. సురేఖకి, నాకు కుమారుడు లాంటి వాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మోస్ట్ లవ్డ్ కిడ్. నీకు మంచి భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు.

 

ఇక అకీరాతో చిన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేసిన చిరు.. ”మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6’4″) అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a “Power”ful future. Happy Birthday Akira!” అని ట్వీట్ చేశారు.

Read This Story Also: లాక్‌డౌన్‌: హైదరాబాద్ పోలీసుల సంచలన నిర్ణయం.. బయటికి వస్తే..!