
సినిమా ప్రియులకు ఈ వారాంతం థియేటర్లలో పండగలా మారబోతోంది. వైవిధ్యమైన కథాంశాలు, విభిన్న జానర్లలో రూపొందిన పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోహీరోయిన్ల సినిమాలతోపాటు చిన్న చిన్న చిత్రాలు సైతం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. యాక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్, ఎపిక్ డ్రామా వంటి విభిన్న కాన్సెప్టులతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ముఖ్యమైన సినిమాల వివరాలు ఇవే. ఇంతకీ ఈ సినిమాలు ఏంటో తెలుసుకోండి.
సర్దార్ 2 (Sardar 2):
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘సర్దార్ 2’. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కార్తీ మరోసారి సరికొత్త స్పై ఏజెంట్ లుక్‌లో అలరించనున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడం, టీజర్ మరియు ట్రైలర్లు మాస్ అండ్ యాక్షన్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, అంతర్జాతీయ గూఢచారి నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
మహేంద్రగిరి వారాహి (Mahendragiri Varahi):
డివోషనల్ , మిస్టరీ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే వారి కోసం వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. ఆధ్యాత్మిక అంశాలకు సస్పెన్స్, అడ్వెంచర్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం టీజర్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. పూర్వం నుంచి ఉన్న నమ్మకాలు, పురాణాల నేపథ్యం మరియు వారాహి అమ్మవారి శక్తిని ఆధారం చేసుకుని రూపొందించిన సీన్లు థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. బిగ్ స్క్రీన్‌పై విజువల్స్, నేపధ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానున్నాయి.
ఎపిక్ (Epic) :
ఈ రెండిటితో పాటు ‘ఎపిక్’ అనే మరో విభిన్నమైన విజువల్ వండర్ కూడా బాక్సాఫీస్ బరిలో నిలిచింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో భారీ నిర్మాణ విలువల (Production Values) తో పాటు ఆకట్టుకునే కథాంశం ఉండబోతోంది. అలాగే కొన్ని చిన్న, మధ్యస్థాయి చిత్రాలు కూడా ఇదే వారాంతంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి.
మండాడి :
కోలీవుడ్‌లో హాస్యనటుడి నుంచి హీరోగా మారిన నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మందాడి’. వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ చిత్రం గురువారమే (సెప్టెంబర్ 10న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మారెమ్మ ..
మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ భూపతీరాజు హీరోగా తెరంగేట్రం చేయనున్నారు. ఈ సినిమాతోనే అతడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో పచ్చి పల్లెటూరి వాతావరణం, ముడి భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం బాక్సాఫీస్ సందడి చేయనున్నారు.
అలాగే హైవాన్ (సెప్టెంబర్ 11), ఫాల్ 2: డెడ్ పాయింట్ (సెప్టెంబర్ 11) సినిమాలు సైతం అడియన్స్ ముందుకు రాబోతున్నాయి. వారం రోజుల పాటు రొటీన్ లైఫ్‌తో బిజీగా ఉన్న సినీ ప్రియులకు, ఈ వీకెండ్‌లో థియేటర్లలో థ్రిల్లింగ్ యాక్షన్, డివోషనల్ మిస్టరీ, విజువల్ డ్రామా రూపంలో పూర్తి వినోదం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.