మ‌ల్టీ టాలెంటెడ్ రామారావు గారు హిందీలో డ‌బ్బింగ్ చింపేస్తున్నార‌ట‌..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 03, 2020 | 2:49 PM

ఇటీవ‌ల రిలీజైన ఆర్.ఆర్.ఆర్ మూవీకి సంబంధించి చ‌ర‌ణ్ ఇంట్రో చూశారుగా. అందుకే చ‌ర‌ణ్ ఇంటెన్సిటి అదుర్స్. అది ప‌క్క‌న‌బెట్టండి. బ్యాగ్రౌండ్ నుంచి తాచు పాము బుస కొట్టిన‌ట్టు, పెద్ద పులి గాండ్రిచ్చినట్టు ఓ వాయిస్ వినిపించిందింగా మ‌న రామారావుది. హా..అదే వాయిస్ హిందీలో కూడా వినిపించ‌బోతుంద‌ట‌. అవును తాజాగా అందుతోన్న నివేదిక‌లు ప్ర‌కారం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హిందీలో తానే ఓన్ గా డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే అందుకు సంబంధించిన డెమో కూడా పూర్త‌య్యింద‌ట‌. సీన్ పేప‌ర్ […]

మ‌ల్టీ టాలెంటెడ్ రామారావు గారు హిందీలో డ‌బ్బింగ్ చింపేస్తున్నార‌ట‌..!
Follow us on

ఇటీవ‌ల రిలీజైన ఆర్.ఆర్.ఆర్ మూవీకి సంబంధించి చ‌ర‌ణ్ ఇంట్రో చూశారుగా. అందుకే చ‌ర‌ణ్ ఇంటెన్సిటి అదుర్స్. అది ప‌క్క‌న‌బెట్టండి. బ్యాగ్రౌండ్ నుంచి తాచు పాము బుస కొట్టిన‌ట్టు, పెద్ద పులి గాండ్రిచ్చినట్టు ఓ వాయిస్ వినిపించిందింగా మ‌న రామారావుది. హా..అదే వాయిస్ హిందీలో కూడా వినిపించ‌బోతుంద‌ట‌. అవును తాజాగా అందుతోన్న నివేదిక‌లు ప్ర‌కారం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హిందీలో తానే ఓన్ గా డ‌బ్బింగ్ చెప్పుకోబోతున్నాడ‌ట‌. ఇటీవ‌లే అందుకు సంబంధించిన డెమో కూడా పూర్త‌య్యింద‌ట‌. సీన్ పేప‌ర్ ను రెండు సార్లు చ‌దివిన తార‌క్..సింగిల్ టేక్ లో డ‌బ్బింగ్ కంప్లీట్ చేశాడ‌ట‌. దీంతో జ‌క్క‌న్న‌తో పాటు హిందీ టెక్నిషియ‌న్లు ఒక్కసారిగా కంగుతిన్నార‌ట‌. అందుకే సినిమా ఫుల్ వెర్ష‌న్ డబ్బింగ్ కి రెడీ అయిపోమ‌ని రాజ‌మౌళి ఎన్టీఆర్ కు చెప్పిన‌ట్లు స‌మాచారం. గతంలో జంజీర్ సినిమా కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్ పై ఆధార‌ప‌డ్డాడు చ‌ర‌ణ్. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో అత‌డు కూడా హిందీలో ఓన్ డ‌బ్బింగ్ కు సై అనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.