Mahesh Wishes Namrata:అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్ : మహేష్ బాబు

|

Jan 22, 2021 | 10:14 AM

టాలీవుడ్ మోస్ట్ లవ్‌బుల్ జంటల్లో ఒకరు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట. ఈరోజు మహేష్ బాబు భార్య నమ్రత 49 వ పుట్టిన పుట్టిన రోజు..

Mahesh Wishes Namrata:అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్ : మహేష్ బాబు
Follow us on

Mahesh Wishes Namrata: టాలీవుడ్ మోస్ట్ లవ్‌బుల్ జంటల్లో ఒకరు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట. ఈరోజు మహేష్ బాబు భార్య నమ్రత 49 వ పుట్టిన పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న తన ప్రేమను తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోని షేర్ చేశారు మహేష్ బాబు. అంతేకాదు నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి పుట్టిన రోజు నేడు.. కనుక ఈ రోజు నాకు మరీ మరీ స్పెషల్ డే అంటూ ట్వీట్ చేశారు మహేష్.

ఈరోజు పుట్టిన జరుపుకుంటున్న తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నమ్రతపై తనకున్న ప్రేమను అభిమానులతో పంచుకున్నాడు. “తాను ఎంతగానో ప్రేమించే ఆ వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ప్రతిరోజు నీతో గడపడం ప్రత్యేకమైనదే.. కానీ ఈ రోజు అది మరింత ప్రత్యేకం. అద్భుతమైన స్త్రీతో అందమైన రోజు. ప్రేమతో.. పుట్టిన రోజు శుభాకాంక్షలు లేడీ బాస్” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. నమ్రతతో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో తీసిన ఫొటోని పోస్ట్ చేశారు మహేష్.

నమ్రతకు బర్త్ డే విషెష్ ను సెలబ్రెటీలు, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. సర్కారు వారి పాట ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ నిమిత్తం మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడే తన భార్య నమ్రత పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్ చేయబోతున్నారు. పుట్టినరోజు వేడుకల అనంతరం నమ్రతా శిరోద్కర్ సహా గౌతమ్, సితార హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని.. మహేష్ బాబు మాత్రం అక్కడే నెల రోజుల పాటు ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌లో పాల్గొననున్నారని సమాచారం. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది