అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం అటు సినిమాలతో.. ఇటు రియాల్టీ షోలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన నా సామిరంగ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్నాళ్లుగా శరవేగంగా జరుగుతుంది. ఇందులో నాగ్ ఫుల్ మాస్ లుక్ లో కనిపించనున్నారని ఇదివరకు విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మరోవైపు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కు హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ అయిన బిగ్ బాస్.. ఇప్పుడు ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతుంది. మొన్నటికీ పన్నెండు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పదమూడవ వారం నడుస్తోంది. అయితే ప్రతి వారం వీకెండ్స్ లో నాగ్ తన స్టైలీష్ లేటేస్ట్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
అడియన్స్ దృష్టిని ఆకర్షించే దుస్తులను ధరించడంలో నాగ్ ముందుటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతున్న ఫ్యాషన్ ప్రపంచంలోకి నాగ్ ఒక స్టైల్ ఐకాన్ అని చెప్పొచ్చు. అయితే మొన్న జరిగిన బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున్ లుక్ అడియన్స్ ను ఫిదా చేసింది. లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ ధరించి మరింత స్టైలీష్ గా కనిపించాడు. ఆ స్వెట్ షర్ట్ ధర ఇప్పుడు అందరిని అవాక్కయేలా చేస్తుంది. లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన ‘ఇంటార్సియా కాష్మెరె వూల్ క్రూనెక్’ స్వెట్‌షర్ట్ ఇది. దీని ధర రూ. 1.82 లక్షలు ఉన్నట్లు ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘సెలబ్రిటీస్ అవుట్‌ఫిట్ డీకోడ్’ షేర్ చేసింది.
ఈ స్వెట్‌షర్ట్ స్వచ్ఛమైన కాశ్మీరీ ఉన్నితో తయారు చేయబడినట్లు తెలుస్తోంది. అయితే లూయిస్ విట్టన్ బ్రాండ్‌లో సాధారణ ధర అని తెలుస్తోంది. లూయిస్ విట్టన్ అనేది ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ్ నాసామిరంగ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా.. ఇందులో ఆషికా రంగనాథన్, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.