Bigg Boss 10 Telugu : పదో వారం ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. టాప్‏లో ఆ ఒక్క కంటెస్టెంట్.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే..

టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ఇప్పుడు పదో వారానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తుండగా .. కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి గురవుతున్నారు కంటెస్టెంట్స్. ఇక ఇప్పటికే తమ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావాల్సిన హింట్స్ తీసుకుని గేమ్ ప్లాన్ మార్చేందుకు రెడీ అయ్యారు కంటెసెంట్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు పదోవారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది.

Bigg Boss 10 Telugu : పదో వారం ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. టాప్‏లో ఆ ఒక్క కంటెస్టెంట్.. డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరంటే..
Bigg Boss 10 Telugu (2)

Updated on: Nov 14, 2026 | 8:21 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 పదో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్ కావడంతో హౌస్మేట్స్ మధ్య బంధాలు, కుటుంబసభ్యులను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు పదోవారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఎప్పటిలాగే ఈ వారం ఓటింగ్‌లో ముఖేష్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా మొదటి నుంచి విన్నర్ మెటిరియల్.. అత్యధిక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న త్రిగుణ్‌ను కూడా దాటి టాప్‌లో ఉన్నాడు ముకేష్. గత వారం ఎలిమినేషన్ జరగకపోవడంతో, ఈ వారం ఇద్దరు హౌస్ నుంచి వెళ్లే అవకాశం ఉందని అంచనా. అయితే ఈ వివరాలన్నీ అనధికారిక ఓటింగ్ ట్రెండ్‌ల ఆధారంగా వచ్చినవి మాత్రమే. . తొమ్మిదో వారం ఎలిమినేషన్ లేదు, సుధీర్ చివరి క్షణంలో సేఫ్ అయ్యాడు. అంతకుముందు ఏడో వారం డబుల్ ఎలిమినేషన్‌లో దక్షి, షాలిని బయటకు వెళ్లారు. అయిదో వారంలో కూడా అపూర్వ, ఆర్జే చరణ్ ఇంటి నుంచి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ రెండు ఎలిమినేషన్ల అవకాశం కనిపిస్తోంది.

ఈ వారం నామినేషన్లలో మొత్తం 12 మంది ఉన్నారు. ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, సుధీర్, నరేష్, రామ్ ప్రసాద్, స్వేత నాయుడు, రామకృష్ణ, శివకుమార్ నామినేట్ అయ్యారు. ఓటింగ్ ట్రెండ్ ప్రకారం ముఖేష్ తర్వాత త్రిగుణ్ సాలిడ్ ఓట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో ఎలిమినేట్ అయిన రోహిత్ అభిమానుల త్రిగుణ్ పై కోపంతో ఇప్పుడు ముకేష్ కు ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నరేష్, అమన్, శివకుమార్ కూడా మంచి ఓటింగ్‌తో ముందుకు సాగుతున్నారు.

తక్కువ ఓటింగ్ ఉన్నవారిలో స్వేత నాయుడు, సుధీర్, రామ్ ప్రసాద్, రామకృష్ణ ఉన్నారు. వీరికి మధ్యస్థాయి ఓట్లు వస్తున్నాయి. డేంజర్ జోన్‌లో దేబ్జానీ, వర్షిణి, నీతూ నటరాజ్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా నీతూ నటరాజ్, రామకృష్ణ, స్వేత నాయుడు, దేబ్జానీ, శివకుమార్‌లలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరగా ఏ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు, వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఎలాంటి విషయాలు చర్చిస్తారనేది వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us