
బిగ్‌బాస్ తెలుగు 10 సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఈ సీజన్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభం కావొచ్చు. ఈసారి కూడా అక్కినేని అక్కినేని నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. పదో సీజన్ కావడంతో ఈ సారి బిగ్ బాస్ షోకు మరిన్ని హంగులు తీసుకురానున్నారు. కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల విషయంలోనూ చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని తెలుస్తోంది. కాగా ఈసారి షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లపై ఊహాగానాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, తేజస్విని గౌడ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ, జబర్దస్త్ వర్ష, వర్షిణీ, ప్రభాకర్ లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడీ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ నందన పేరు కూడా బాగా వినిపిస్తోంది.
‘నందుస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానెల్ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది నందన. ట్రావెలింగ్ వీడియోలు, లైఫ్ స్టైల్ కంటెంట్, పర్సనల్ పోస్ట్ లతో ఎంతో మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇదే క్రేజ్ తోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంలోనూ ఓ పాత్రలో నటించిందీ అందాల తార. ఇక ఇటీవల వీసాకు సంబంధించిన వివాదంతోనూ బాగా వార్తల్లో నిలిచింది నందన. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీయడంతో, ఆమెకు మరింత గుర్తింపు పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్ఆయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీషోకు నందనను తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారని, నందన, బిగ్ బాస్ నిర్వాహకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ నందన బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వస్తే మాత్రం హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ కు ఏ మాత్రం కొదవ ఉండదని చెప్పుకోవచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి