Bigg Boss 5 Telugu: లోబోని టార్గెట్ చేశారుగా.. ముళ్ళపంది అని రవి.. అతడికి మ్యాటర్ లేదని లహరి..

బిగ్ బాస్ హౌస్‌లో వారాంతం వస్తే చాలు జోష్ రెట్టింపవుతుంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లో హంగామాను రెట్టింపు చేయడానికి రెడీ అయిపోయాడు.

Bigg Boss 5 Telugu: లోబోని టార్గెట్ చేశారుగా.. ముళ్ళపంది అని రవి.. అతడికి మ్యాటర్ లేదని లహరి..
Lobo

Updated on: Sep 12, 2021 | 4:56 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో వారాంతం వస్తే చాలు జోష్ రెట్టింపవుతుంది. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లో హంగామాను రెట్టింపు చేయడానికి రెడీ అయిపోయాడు. నిన్న శనివారం రోజు ఇంటిసభ్యులతో నాగార్జున ముచ్చటించారు. సీజన్‌5లో ఇది తొలి వీకెండ్ కావడంతో జోష్ మరింత ఎక్కువే ఉంది. ముందుగా వారమంతా ఇంటిసభ్యులు ఏం చేశారో వివరించి ఆటపట్టించిన నాగ్.. ఆ తర్వాత తన స్టైల్‌లో టాస్క్‌లు ఇచ్చాడు. ఇక మొదటి వారం కాబట్టి ఇంటి సభ్యుల తప్పొప్పులను కడిగి పారేయకుండా.. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారని ఓ ఛాన్స్ ఇస్తున్నా అన్నారు నాగ్. ఈ క్రమంలో ఉమా ఊరికే కోపడుతుందని.. కాజల్ అందరి విషయాల్లోనూ వేలు పెడుతుందని.. లహరి టెంపర్ చూపిస్తుందని.. జెస్సీకి పెద్దవాళ్లంటే గౌరవం లేదని.. అలాగే లోబో బాగానే ఎంటర్ టైన్ చేస్తున్నాడని .. షణ్ముఖ్‌ను ఇప్పటికైనా కెమెరాకు కనిపించు అని నాగ్ అన్నారు.

ఇదిలా ఉంటే మొదటివారం జైలుకు వెళ్లిన జేసీ మీద అందరూ సింపథి చూపించారు. అయితే ఇది ఆనీ మాస్టర్‌కు ఏమాత్రం నచ్చలేదు. రవి దగ్గర ఓపెన్ అయ్యింది ఆనీ. రవి కూడా ఆనీకి సపోర్ట్‌గా మాట్లాడాడు. జైలుకి వెళ్లాడు కదా ఇక పై తెలుసుకుంటాడులే అని అన్నాడు. ఆ తర్వాత లోబోని ఆటపట్టించాడు యాంకర్ రవి. లహరిని లోబో చూస్తుంటే.. ‘రేయ్ నువ్ అలా చూడకురా.. నిన్ను మళ్ల పంది అనుకుంటుంది అని లహరికి కన్ను కొట్టాడు రవి. దానికి లోబో స్పందిస్తూ.. అవును నేను మూలన కూర్చున్నా కాబట్టి.. ముళ్లపందినే అని అన్నాడు. వీడు ఎంత చూసినా నీకు పర్లేదు లహరి.. ఎందుకంటే మ్యాటర్ లేదు కాబట్టి అని అన్నాడు.. మ్యాటర్ అంటే ఏంటి అని రవి అంటే.. సీరియస్ మ్యాటర్ లేదు అని కవర్ చేసింది లహరి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun: కాకినాడలో పుష్ఫరాజ్‌ సందడి.. వర్షం కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌. గ్యాప్‌లో ఎక్కడికి వెళ్లాడో తెలుసా.?

Bigg Boss 5 Telugu: బూతులు తిట్టమంటూ సరయుని కోరిన నాగ్.. ఇక అమ్మడు ఆగేనా..

Sai Dharam Tej Bike Accident: సాయి ధరమ్ తేజ్ సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాడు.. ప్రమాదంపై పూర్తి వివరాలను ప్రకటించిన పోలీసులు..

Loading...
Unable to load recommendations.
Follow Us