Bigg Boss 10 Telugu : తొక్కలో అగ్నిపరీక్ష.. మళ్లీ మాట జారిన త్రిగుణ్ .. నాగార్జున చేతిలో ఇక వాయింపే..

బిగ్ బాస్ 10 తెలుగు మొదటి నుంచే రసవత్తరంగా సాగుతుంది. తొలి రోజే గొడవలతో మొదలైన ఈ షో.. త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అన్నట్లుగా సాగుతుంది. ముఖ్యంగా త్రిగుణ్ మాటలు.. కావాలని రోహిత్ ను తన మాటలతో రెచ్చగొడుతూ కనిపిస్తున్నాడు. మొత్తానికి తన అతి యాటిట్యూడ్ తో మరోసారి రోహిత్ పై నోరు పారేసుకున్నాడు త్రిగుణ్.

Bigg Boss 10 Telugu : తొక్కలో అగ్నిపరీక్ష.. మళ్లీ మాట జారిన త్రిగుణ్ .. నాగార్జున చేతిలో ఇక వాయింపే..
Trigun Vs Rohit

Updated on: Sep 11, 2026 | 10:04 AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ తొలివారంలోనే హౌస్‌లో తీవ్ర స్థాయిలో రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా రోహిత్ వర్సెస్ త్రిగుణ్ మధ్య ఓ రేంజ్ ఫైట్ సాగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ల మంటలు మరింతగా రాజుకున్నాయి. హౌస్‌లోని 16 మంది సభ్యుల్లో హౌస్‌మేట్స్ కావడానికి అనర్హులైన వారిని ఎంపిక చేయమని బిగ్ బాస్ ఆదేశించగా, రెడ్ టీమ్ నుంచి రామ్ ప్రసాద్, బ్లూ టీమ్ నుంచి చరణ్‌ల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఇద్దరూ “హై రిస్క్” జోన్‌లోకి వెళ్లడమే కాకుండా, వీరిలో ఒకరు ఏ క్షణమైనా ఎలిమినేట్ కావచ్చని బిగ్ బాస్ ప్రకటించడంతో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ మిడ్-వీక్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ నామినేషన్ల రౌండ్ నిర్వహించారు. ఇంటి నుంచి బయటకు పంపాలనుకుంటున్న వారి ముఖానికి రంగు పూసి తగిన కారణం చెప్పాలని కోరారు. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మొదటగా త్రిగుణ్ వచ్చి చరణ్‌కు రంగు పూశాడు. రామ్ ప్రసాద్ తన టీమ్ కోసం రిస్క్ తీసుకోవడాన్ని త్రిగుణ్ సమర్థించగా, అదే కారణంతో సృష్టి మాత్రం రామ్ ప్రసాద్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

ఇక షాలిని, రామ్ ప్రసాద్‌పై విరుచుకుపడింది. “ఎంటర్‌టైన్‌మెంట్ అనే ముసుగు వేసుకుని ఇద్దరి మధ్య గొడవలు పెడుతున్నారు” అంటూ రామ్ ప్రసాద్ తీరును ఎండగట్టింది. అలాగే తనకు యాటిట్యూడ్ అని అన్నారని ఆ మాటను గుర్తు చేసింది. దీనిపై రామ్ ప్రసాద్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వేలు చూపిస్తూ మాట్లాడడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడిచింది.

మరోవైపు, త్రిగుణ్ చేసిన “తొక్కలో అగ్నిపరీక్ష” అనే వ్యాఖ్యలు హౌస్‌లో తీవ్ర దుమారాన్ని లేపాయి. రోహిత్, చరణ్ దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. “అగ్నిపరీక్షను తీసిపారేసేలా మాట్లాడటం సరికాదు” అని హెచ్చరించారు. కృష్ణుడు కూడా చరణ్‌ను నామినేట్ చేస్తూ, గ్రూప్ గేమ్‌ను కాకుండా ఇండివిజువల్‌గా ఆడాలని హితబోధ చేశాడు. రామ్ ప్రసాద్ కూడా చరణ్‌ను ఉద్దేశించి “నేను ప్రౌడ్‌గా వచ్చాను, నువ్వు మీ టీమ్ సెలెక్ట్ చేస్తే వచ్చావ్” అంటూ గట్టిగానే ఫైర్ అయ్యాడు. హౌస్‌మెట్స్ ఎక్కువ మంది చరణ్‌నే నామినేట్ చేయడంతో అతడు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే త్రిగుణ్ “తొక్కలో అగ్నిపరీక్ష” అన్న పదంపై వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున క్లాస్ పీకుతారో లేదో చూడాలని అడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో ఓ కంటెస్టెంట్ తొక్కలో అని మాట్లాడినందుకు పదే పదే తొక్కా తొక్కా అంటూ గాలి తీసేశారు నాగార్జున. ఇప్పుడు త్రిగుణ్ ఏకంగా తొక్కలో అగ్నిపరీక్ష అన్నాడు. మరి ఈసారి నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

Loading...
Unable to load recommendations.
Follow Us