Bigg Boss 10 Telugu : రోహిత్ పై నోరు జారిన త్రిగుణ్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెంట్స్.. తిట్టిపోస్తున్న అడియన్స్..

బిగ్ బాస్ 10 తెలుగులో సామాన్యులతోపాటు సెలబ్రెటీస్ సైతం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు నుంచి అటు ఇంట్లో సభ్యులకు.. ఇటు ప్రేక్షకులకు చిరాకు పుట్టిస్తోన్న ఏకైక కంటెస్టెంట్ త్రిగుణ్. కారణం లేకుండానే రోహిత్ ను టార్గెట్ చేసి మరీ ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లోనూ మరోసారి నోరుజారాడు.

Bigg Boss 10 Telugu : రోహిత్ పై నోరు జారిన త్రిగుణ్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెంట్స్.. తిట్టిపోస్తున్న అడియన్స్..
Trigun Vs Rohit

Updated on: Sep 11, 2026 | 7:11 AM

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 10 గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. అయితే మొదటి రోజు నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. ప్రతి సారి తన నోటికి పని చెబుతూ మరి కెమెరా కళ్లల్లో పడుతున్న ఏకైక కంటెస్టెంట్ త్రిగుణ్. ప్రతిసారి రోహిత్ ను టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గురువారం (సెప్టెంబర్ 10న) రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. హౌస్‌లో కంటెస్టెంట్ త్రిగుణ్, రోహిత్‌ల మధ్య నడిచిన తీవ్ర వాగ్వాదం ఈ రోజు ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. చిన్న కారణంతో మొదలైన గొడవ కాస్తా పర్సనల్ అటాక్ వరకు వెళ్లడం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా రోహిత్ బాడీ గురించి త్రిగుణ్ మాట్లాడుతూ స్టెరాయిడ్స్ ఎక్కించుకుని బాడీని బిల్డ్ చేశాడంటూ కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా నేషనల్ టెలివిజన్ లో దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. కిచెన్‌లో గిన్నెలు కడిగే బాధ్యతను రోహిత్‌కు అప్పగించడంతో ఈ రచ్చ ప్రారంభమైంది. రోహిత్ సరిగ్గా గిన్నెలు శుభ్రం చేయడం లేదంటూ అతడిని టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నాడు. ఇక మొదటి నుంచి రోహిత్ గిన్నెలు కడగడం నుంచి ప్రతి చిన్న విషయానికి వంకలు పెట్టడం, పిలిచి మరీ పని చేయించడం కనిపించింది. రోహిత్ కిచెన్ డ్యూటీ చేస్తున్న ప్రతిసారీ త్రిగుణ్ అక్కడికి వచ్చి రకరకాల రూల్స్ పెడుతూ అతన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. గిన్నెలు సరిగ్గా కడగడం లేదని, అరగంటకోసారి వచ్చి సింక్ చెక్ చేసుకోవాలని త్రిగుణ్ చెప్పిన తీరు రోహిత్‌ను తీవ్ర అసహనానికి గురిచేసింది.ప్రతిసారి వచ్చి చూసుకోవడం అంటే అవ్వదు. గిన్నెలు కనిపిస్తే నాకు వచ్చి ఒక మాట చెప్పండి క్లీన్ చేస్తా అని రోహిత్ అనగా.. లేదు.. ఒప్పుకోనంటూ యూటిట్యూడ్ చూపించాడు. అలాగే వంశీ వంట చేస్తుంటే గిన్నెలు ఉన్నాయంటూ త్రిగుణ్ అరవడంతో వెంటనే వచ్చి క్లీన్ చేశాడు రోహిత్. అయినప్పటికీ కావాలని రోహిత్ ను మాటలు అంటూ.. నేను చెక్ చేస్తున్నానంటూ రెచ్చగొట్టాడు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అత్యంత వివాదాస్పద కంటెస్టెంట్ అంటే త్రిగుణ్ అనేలా విసుగు పుట్టిస్తున్నాడు త్రిగుణ్.

ఇక రోహిత్, త్రిగుణ్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఈ గొడవ మరింత ముదిరిన క్రమంలో త్రిగుణ్ ఏకంగా రోహిత్ బాడీ పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. “నీది స్టెరాయిడ్స్ బాడీ.. పోరా పిల్లబచ్చా.. డొల్లా రాజా” అంటూ నీచంగా మాట్లాడాడు త్రిగుణ్. రోహిత్‌ను వ్యక్తిగతంగా విమర్శించాడు. బాడీ బిల్డింగ్ కోసం రోహిత్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ తీసుకున్నాడనే అర్థం వచ్చేలా జాతీయ టెలివిజన్ సాక్షిగా మాట్లాడటం హౌస్‌లో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ తరువాత రోహిత్ వచ్చి చరణ్ దగ్గర కూర్చుని.. ‘నా బాడీ స్టెరాయిడ్స్‌పై బిల్డ్ అయ్యిందని అంటున్నాడు.. బాడీల గురించి అతనికి ఎందుకు? అని చరణ్ అంటే.. అవే కదా మరి ఎక్స్ ట్రాలు అని అన్నాడు రోహిత్. త్రిగుణ్ ఎంతగా రెచ్చగొట్టినా, పర్సనల్ కామెంట్స్ చేసినా రోహిత్ చాలా వరకు సహనంతోనే సమాధానమిచ్చాడు. త్రిగుణ్ మాటలకు ప్రశాంతంగా కౌంటర్లు ఇస్తూ, తన పని తాను చేసుకుపోవడం కనిపించింది. నామినేషన్స్ ప్రక్రియలో త్రిగుణ్ ప్రవర్తనను, యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ లేకపోవడాన్ని రోహిత్ ఎత్తిచూపాడు.

గతంలో సీజన్ 8లో గౌతమ్ కూడా యావర్ బాడీపై ఇటువంటి సైగలే చేయడంతో నాగార్జున తీవ్రంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రిగుణ్ నేరుగా రోహిత్ బాడీపై వ్యాఖ్యలు చేయడంతో ఈ శనివారం నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో త్రిగుణ్‌కు ఏ రేంజ్‌లో క్లాస్ పీకుతారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి సెప్టెంబర్ 10 ఎపిసోడ్‌లో త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలు బిగ్ బాస్ లవర్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నాగార్జున గారు ఈ పాయింట్‌ను ఎలా డీల్ చేస్తారో చూడాల్సి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us