‘Tandav’ Youth Anthem: బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘తాండవ్’. ఇప్పటికే ట్రైలర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి యూత్ యాంథమ్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట యువతను ఉర్రూతలూగిస్తోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు హిమాన్షు కిషన్ మోహ్రా నిర్మాతగా వ్యవహరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ జనవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. డింపుల్ కపాడియా, మహ్మద్ జీషన్‌అయూబ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. రాజకీయాలే ప్రధానాంశంగా వస్తున్న ఈ సిరీస్ 9 భాగాలుగా ఉంటుంది. ఇప్పటికే ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో సిరీస్‌పై అంచనాలు అధికంగానే ఉన్నాయి.
Tandav Absolutely Brilliant: తాండవ్ తారాగణంతో పనిచేయడం చాలా సంతోషం కలిగించింది : నటి కృతిక కమ్ర