Tamannaah: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననున్న తమన్నా.. ఎంతో గౌరవంగా ఉందంటోన్న బ్యూటీ..

|

May 18, 2022 | 7:44 AM

Tamannaah: అంతర్జాతీయంగా సినిమా రంగంలో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు (Cannes Film Festival) ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలని నటీ, నటులు అందరూ ఇష్టపడుతుంటారు...

Tamannaah: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తళుక్కుమననున్న తమన్నా.. ఎంతో గౌరవంగా ఉందంటోన్న బ్యూటీ..
Follow us on

Tamannaah: అంతర్జాతీయంగా సినిమా రంగంలో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు (Cannes Film Festival) ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఈవెంట్‌లో పాల్గొనాలని నటీ, నటులు అందరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా నటీమణులు రెడ్‌ కార్పెట్‌పై చేసే క్యాట్‌ వాక్‌కు ఎక్కడలేని ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది అందాల తార తమన్నా. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫ్రాన్స్‌ చేరుకున్న తమన్న తాజాగా తన లెటేస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. మే 17 నుంచి 28 వరకు జరగబోయే ఈ వేడుకల్లో ఇండియన్‌ పెవిలియన్‌ను బుధవారం (ఈరోజు) ఆవిష్కరించనున్నారు.

భారత సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనురాగ్ ఠాకూర్‌ నేతృత్వంలోనే స్టార్‌-స్డడెడ్‌ భారతీయ ప్రతినిధి బృందంలో తమన్నా హాజరు కానుంది. ఈ విషయమై తమన్నా మాట్లాడుతూ.. కేన్స్‌ ఫెస్టివల్‌లో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని, గౌరవంగా భావిస్తున్నానని తెలిపింది. వేడుకలో పాల్గొనడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇక తమన్నాతో పాటు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పలువురు బాలీవుడ్‌ నటీ, నటులు పాల్గొననున్నారు. ఇక ఈరోజు జరగబోయే ఇండియన్‌ పెవిలియన్‌ను నరేంద్రమోదీ వీడియో సందేశంతో ప్రారంభిస్తారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సిద్ధమైన తమన్నా..

 

మరిన్ని సినిమా వార్తలకు క్లిక్ చేయండి..