
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ యూనిట్ ఇటీవల మేకింగ్ వీడియోను విడుదల చేయగా.. మరో రెండు రోజుల్లో టీజర్‌ను రిలీజ్ చేయనుంది. ఈ మేరకు తాజాగా మరో పోస్టర్‌ను షేర్ చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రానుండగా.. అన్ని భాషల్లోనూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.
కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా.. పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్‌ను అందించారు. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.