Sye Raa: మెగాస్టార్, పవర్‌స్టార్, మెగా పవర్‌స్టార్

| Edited By:

Aug 14, 2019 | 7:03 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి నుంచి మేకింగ్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ప్రధానపాత్రాధారులతో పాటు సినిమా కోసం ఉపయోగించిన కాస్టూమ్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ముగ్గురూ కనిపించడం. వీరు ముగ్గురు ఒకే చోట కనిపించనప్పటికీ.. అక్కడక్కడ ఒక్కొక్కరుగా కనిపించారు. […]

Sye Raa: మెగాస్టార్, పవర్‌స్టార్, మెగా పవర్‌స్టార్
Follow us on

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి నుంచి మేకింగ్ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ప్రధానపాత్రాధారులతో పాటు సినిమా కోసం ఉపయోగించిన కాస్టూమ్స్, కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ముగ్గురూ కనిపించడం. వీరు ముగ్గురు ఒకే చోట కనిపించనప్పటికీ.. అక్కడక్కడ ఒక్కొక్కరుగా కనిపించారు. ముఖ్యంగా సైరా సెట్‌లోకి పవన్ కల్యాణ్ వెళ్లడం.. అక్కడ అమితాబ్‌తో ముచ్చటించడం చూసిన మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 20న సైరా టీజర్ రానుండగా.. దానికి పవన్ కల్యాణ్ వాయిస్ అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.