Sushant Suicide: సీబీఐకి సుశాంత్‌ కేసు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం

| Edited By:

Jul 30, 2020 | 3:19 PM

సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌.. ''ఒక వ్యక్తి మంచోడా..? చెడ్డోడా..? అన్న దానిపై కాదు.

Sushant Suicide: సీబీఐకి సుశాంత్‌ కేసు.. పిటిషన్ కొట్టేసిన సుప్రీం
Follow us on

Sushant Case Tranfers to CBI: సుశాంత్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని బెంచ్‌.. ”ఒక వ్యక్తి మంచోడా..? చెడ్డోడా..? అన్న దానిపై కాదు. కానీ ఈ కేసును ఇప్పుడు ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. అందుకే ఈ పిటిషన్‌ని కొట్టివేస్తున్నాము” అని అన్నారు.

కాగా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ అల్కా ప్రియ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో సుశాంత్‌ చాలా మంచోడని, నాసాకు వెళ్లేందుకు చాలామంది పిల్లలకు అతడు సాయం చేశాడని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే రియాతో పాటు మరో ఆరు మందిపై సుశాంత్ తండ్రి కేకే సింగ్‌ ఫిర్యాదుతో ఈ కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. రియా తన మాటలతో సుశాంత్‌ని తమ కుటుంబానికి దూరంగా ఉండేలా చేసిందని, తన కుమారుడి బ్యాంక్ అకౌంట్‌ని ఆమెనే హ్యాండిల్ చేసేదని ఆయన ఆరోపించారు. ”ఒకానొక సమయంలో నా కుమారుడు సినిమాలు వదిలి, కూర్గ్‌లో వ్యవసాయం చేయాలనుకున్నాడు. కానీ రియా నా కుమారుడిని బ్లాక్‌ మెయిల్ చేసింది. మెడికల్‌ హిస్టరీని పబ్లిక్‌కి చూపుతానని, మెంటల్లీ స్టేబుల్‌ అని ప్రపంచానికి చూపిస్తానని బెదిరించింది” అని కేకే సింగ్‌ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Read This Story Also: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనిల్ మురళీ కన్నుమూత