Mahesh Babu: అప్పుడే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నా..!

| Edited By: Pardhasaradhi Peri

Feb 17, 2020 | 2:58 PM

Mahesh Babu: హీరో అవ్వాలని తనలో ఎప్పుడు బీజం పడిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు తాను కూడా హీరో అవ్వాలని భావించానని అన్నారు. హీరోగా తనను ఇన్‌స్పైర్ చేసింది కూడా తన తండ్రి అని మహేష్ తెలిపారు. తాను సంతోషంగా ఉండేందుకు తన కుటుంబమే కారణమని మహేష్ పేర్కొన్నారు. ఇక తనకు సిగ్గు ఎక్కువని.. సెన్సిటివ్ పర్సన్‌ను అంటూ మహేష్ తన […]

Mahesh Babu: అప్పుడే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నా..!
Follow us on

Mahesh Babu: హీరో అవ్వాలని తనలో ఎప్పుడు బీజం పడిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు తాను కూడా హీరో అవ్వాలని భావించానని అన్నారు. హీరోగా తనను ఇన్‌స్పైర్ చేసింది కూడా తన తండ్రి అని మహేష్ తెలిపారు. తాను సంతోషంగా ఉండేందుకు తన కుటుంబమే కారణమని మహేష్ పేర్కొన్నారు. ఇక తనకు సిగ్గు ఎక్కువని.. సెన్సిటివ్ పర్సన్‌ను అంటూ మహేష్ తన గురించి వెల్లడించారు. సోషల్ మీడియాలో తనను ప్రస్తావిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ఇక క్యాజువల్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని మహేష్ అన్నారు.

కాగా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన మహేష్.. రెండో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం సత్తా చాటింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన మహేష్.. ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నారు మహేష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇందులో మహేష్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నట్లు టాక్.