Dulquer Salmaan : బాలీవుడ్ పైన కన్నేసిన మలయాళ హీరో… థ్రిల్లర్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్న దుల్కర్ సల్మాన్

|

Jan 20, 2021 | 5:46 AM

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.

Dulquer Salmaan : బాలీవుడ్ పైన కన్నేసిన మలయాళ హీరో... థ్రిల్లర్ సబ్జెక్ట్ తో సినిమా చేస్తున్న దుల్కర్ సల్మాన్
Follow us on

Dulquer Salmaan : మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కర్ సల్మాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆయన, నేరుగా తెలుగులో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకూ సౌత్ లోనే సినిమాలు చేసిన దుల్కర్..ఇప్పుడు బాలీవుడ్ పైన కన్నేశాడు.

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బాల్కి.. దుల్కర్ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.   ఓ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో బాల్కీ ఈ సినిమాను రూపొందిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటివరకు దుల్కర్ టచ్ చేయని కథను సిద్ధం చేసాడట దర్శకుడు . బాల్కీ స్వయంగా ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇక హీరోయిన్.. ఇతర పాత్రలు.. టెక్నీషియన్ల వివరాల గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు దుల్కర్. లెఫ్టినెంట్ పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి యుద్ధంతో రాసిన ప్రేమ క‌థ అనే క్యాప్ష‌న్ చిత్ర టైటిల్‌కి ఇచ్చారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయ‌నున్నారు.