Soorarai Pottru: ఆస్కార్ నామినేషన్ రేసులో ‘ఆకాశం నీ హద్దురా’! ఉత్తమ నటీ నటులతో పాటు పలు విభాగాల్లో నామినేట్..

Soorarai Pottru: తమిళ కథానాయకుడు సూర్య నటించిన (సూరారై పోట్రు) తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Soorarai Pottru: ఆస్కార్ నామినేషన్ రేసులో ఆకాశం నీ హద్దురా! ఉత్తమ నటీ నటులతో పాటు పలు విభాగాల్లో నామినేట్..

Updated on: Jan 26, 2021 | 11:56 PM

Soorarai Pottru: తమిళ కథానాయకుడు సూర్య నటించిన (సూరారై పోట్రు) తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అకాడమీ స్క్రీనింగ్​ రూమ్​లో మంగళవారం ఈ చిత్రాన్ని ప్రదర్శించారని సమాచారం. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

సుధా కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌, కరోనా వైరస్ కారణంగా ఓటీటీ వేదికగా విడుదలైన చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య నటన, సుధా కొంగర టేకింగ్ అందరినీ అలరించింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో పాటు పలు విభాగాల్లో నామినేట్ అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా అకాడమీ అవార్డులను కేవలం థియేటర్లలో విడుదలైన చిత్రాలనే పరిశీలిస్తారు. కానీ, ఈ ఏడాది కరోనా సంక్షోభం కారణంగా డిజిటల్​ వేదికల్లోనూ విడుదలైన చిత్రాలను ఆస్కార్​ పోటీకీ అర్హులుగా పరిగణించారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాపై కెప్టెన్ గోపినాధ్ ప్రశంసలు.. గుండెను తాకిందంటూ ట్వీట్..

Loading...
Unable to load recommendations.
Follow Us