అద్భుతంలా ఉంది ఈ చిత్ర షూటింగ్.. ప్రమాదం అని తెలిసినా అందరు సహకరించారంటున్న ప్రముఖ బాలీవుడ్ హీరో..

|

Dec 16, 2020 | 5:35 AM

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా సైలెంట్‌గా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో

అద్భుతంలా ఉంది ఈ చిత్ర షూటింగ్.. ప్రమాదం అని తెలిసినా అందరు సహకరించారంటున్న ప్రముఖ బాలీవుడ్ హీరో..
Follow us on

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా సైలెంట్‌గా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో నాని ఇండియన్ క్రికెట్ టీంలో ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో క్రికెటర్‌గా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు నాని. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రిమేక్ చేస్తున్నారు. అందులో హీరోగా షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. దీంతో చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ షాహిద్ కపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కొవిడ్ సమయంలో నెల15 రోజులు షూటింగ్ చేశాం. ప్రమాదం అని తెలిసినా అందరు రోజు సెట్‌కు వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇది ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. అద్భతంలా ఉంది ఈ చిత్ర షూటింగ్. సినిమా కోసం కష్టపడినవారందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు షాహిద్.. అంతేకాకుండా కొన్ని సినిమాలు మనసుకు హత్తకునేలా ఉంటాయి. అందులో జెర్సీ కూడా ఒకటని అన్నారు.