Shahid Kapoor : మరో హిట్ కొట్టడానికి సిద్దమైన షాహిద్.. రిలీజ్ డేట్ ను లాక్ చేసిన ‘జర్సీ’ టీమ్

|

Jan 17, 2021 | 1:38 PM

నాని నటించిన 'జర్సీ' సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు..

Shahid Kapoor : మరో హిట్ కొట్టడానికి సిద్దమైన షాహిద్.. రిలీజ్ డేట్ ను లాక్ చేసిన జర్సీ టీమ్
Follow us on

Shahid Kapoor : నాని నటించిన ‘జర్సీ’ సినిమా తెలుగులో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈసినిమా బాలీవుడ్ లోకి వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగులో ‘జర్సీ’కి దర్శకత్వం వహించిన గౌతమ్ హిందీలోనూ డైరెక్ట్ చేయబోతున్నాడు.

దిల్ రాజు, గీతా ఆర్ట్స్, అమన్ గిల్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు చిత్రయూనిట్. ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. నవంబర్ 5 న, 2021 విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్  రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో షాహిద్ కపూర్ చేసాడు. ఇప్పుడు జర్సీ కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాడు షాహిద్. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుందని ధీమా గా ఉన్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న దళపతి విజయ్ ‘మాస్టర్’.. హీరోలుగా ఎవరు నటించనున్నారంటే.!!