ఒకే ఫ్రేమ్‌లో ఖాన్ త్రయం.. తెరపైకి క్రేజీ కాంబినేషన్

| Edited By:

Nov 05, 2019 | 3:50 PM

అవును నిజంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇది అంతకుమించిన వార్తే. బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. అదేదో పాట కోసమో.. లేక యాడ్‌ కోసమో వీరు కలవడం లేదు. ఓ సినిమాలో ఈ ముగ్గురు కనిపించబోతున్నారట. నిజంగా నిజమండి. ఈ కాంబినేషన్‌ కోసం ఎంతోమంది ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా.. త్వరలోనే వారందరి కోరిక నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చందా అనే మూవీలో నటించనున్న విషయం తెలిసిందే. […]

ఒకే ఫ్రేమ్‌లో ఖాన్ త్రయం.. తెరపైకి క్రేజీ కాంబినేషన్
Follow us on

అవును నిజంగా బాలీవుడ్ ప్రేక్షకులకు ఇది అంతకుమించిన వార్తే. బాలీవుడ్ ఖాన్ త్రయం ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. అదేదో పాట కోసమో.. లేక యాడ్‌ కోసమో వీరు కలవడం లేదు. ఓ సినిమాలో ఈ ముగ్గురు కనిపించబోతున్నారట. నిజంగా నిజమండి. ఈ కాంబినేషన్‌ కోసం ఎంతోమంది ప్రేక్షకులు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా.. త్వరలోనే వారందరి కోరిక నెరవేరబోతున్నట్లు తెలుస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చందా అనే మూవీలో నటించనున్న విషయం తెలిసిందే. 1994లో హాలీవుడ్‌లో వచ్చిన ఫారెస్ట్ గంప్ ప్రేరణతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో అమీర్ సరసన కరీనా కపూర్ నటిస్తోంది.

కాగా ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత అతుల్ కులకర్ణి స్క్రిప్ట్‌ను అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆయన షారూక్ ఖాన్ కోసం ఓ పాత్రను పెట్టారట. ఏదో కెమెరా అప్పియరెన్స్‌లా కాకుండా.. ఓ కీలక పాత్రను షారూక్‌ ఖాన్‌ను దృష్టిలో పెట్టుకొని రాశారట. ఈ విషయమై షారూక్‌ను సంప్రదించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు వీరిద్దరితో పాటు కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ మూవీలో భాగం అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయని సమాచారం. కాగా తాము ముగ్గురం కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నామని.. స్క్రిప్ట్‌ నచ్చితే ఒకే చిత్రంలో నటిస్తామంటూ.. ఈ ఖాన్ త్రయం పలు సందర్భాలలో వెల్లడించింది.

అయితే ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించిన ఈ ముగ్గురు ఈ మధ్యన కాస్త వెనుకబడ్డారు. కొత్త సబ్జెక్ట్‌లతో కొత్త హీరోలు హిట్లు కొడుతూ తమ మార్కెట్ పెంచుకుంటుండగా.. ఈ ముగ్గురు మాత్రం అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. మరోవైపు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాలీవుడ్‌లోనూ బాహుబలి 2 రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఆ రికార్డును బ్రేక్ చేయాలని ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కావడం లేదు. ఇక ఇప్పుడు ఖాన్ త్రయం ఒకే చిత్రంలో నటించి.. ఆ రికార్డును బ్రేక్ చేస్తుందేమో చూడాలి.