ఆ మూవీ నుంచి సాయి పల్లవి ఔట్‌.. లైన్‌లోకి రష్మిక!

| Edited By:

Oct 24, 2020 | 4:10 PM

శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా తిరుపతిలో ఈ మూవీ ప్రారంభం కానుంది.

ఆ మూవీ నుంచి సాయి పల్లవి ఔట్‌.. లైన్‌లోకి రష్మిక!
Follow us on

Sai Pallavi News: శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. దసరా సందర్భంగా తిరుపతిలో ఈ మూవీ ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపించింది. ఇక ఈ విషయాన్ని మలార్ బ్యూటీ కూడా అప్పట్లో ఓ సందర్భంలో కన్ఫర్మ్ చేశారు. శర్వానంద్‌తో తాను మరోసారి నటిస్తున్నట్లు పేర్కొన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి సాయి పల్లవి ఔట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆమె స్థానంలో రష్మికను తీసుకున్నట్లు సమాచారం.

కాగా నేను శైలజ మూవీ తరువాత కిశోర్ తిరుమల వెంకటేష్‌తో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే మూవీని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ఆగిపోయింది. ఇక అదే కథను కిశోర్‌, శర్వాకు చెప్పడం.. ఆయన ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. ఇక ఇప్పుడు శర్వా మూవీకి కూడా అదే టైటిల్‌ని పెట్టినట్లు సమాచారం. ఎల్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఆదివారం అధికారికంగా తెలియనున్నాయి.

Read More:

నిలకడగా రాజశేఖర్ ఆరోగ్యం

చైనా యెల్లో డస్ట్‌తో ‘కిమ్’‌ ఇలాకాలో గుబులు.. కరోనా వస్తుందంటూ కీలక ఆదేశాలు