Saaho Review: ప్రభాస్ వన్ మ్యాన్ షో… ‘సాహో’ యాక్షన్ పీక్స్

| Edited By:

Aug 30, 2019 | 10:15 AM

టైటిల్ : ‘సాహో’ తారాగణం : ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజీత్‌ విడుదల తేదీ: 30-08-2019 ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ […]

Saaho Review: ప్రభాస్ వన్ మ్యాన్ షో... సాహో యాక్షన్ పీక్స్
Follow us on

టైటిల్ : ‘సాహో’
తారాగణం : ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు
సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌
నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుజీత్‌
విడుదల తేదీ: 30-08-2019

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’. బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ హీరోయిన్ గా… భారీ తారాగణంతో, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి ఈ సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ మాట ఇది ఒక అంతర్జాతీయ సినిమా అని. అందుకు తగ్గట్టే దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో సుమారు 10,000 థియేటర్ల పైగానే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా.? లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ:
డేంజరస్ గ్యాంగ్ స్టర్స్ నిండి ఉన్న వాజీ సిటీ నుంచి ‘సాహో’ కథ మొదలవుతుంది. అండర్ వరల్డ్ డాన్ పృధ్వీ రాజ్(టీనూ ఆనంద్) తన సామ్రాజానికి కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీ రాజ్‌‌కు నమ్మిన బంటుగా ఉన్నాడు రాయ్‌ (జాకీ ష్రాఫ్‌. అతడు రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుండటం దేవరాజ్‌‌కు ఇష్టం ఉండదు. దీంతో పగ పెంచుకుంటాడు. ఎలాగైనా రాయ్ అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంటాడు దేవరాజ్. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది.

ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) పోయిన రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని గ్యాంగ్ స్టర్స్ ముందు సవాలు విసురుతాడు. అటు ఆ దొంగతనానికి కారణం ఎవరనే దానిపై పోలీసులు అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌)ని సీన్‌లోకి దింపుతారు. అతడు క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు.

ఇంతకీ రాయ్ ఎలా చనిపోయాడు.? విశ్వక్ సవాలులో గెలిచాడా..? లేదా.? అశోక్‌ చక్రవర్తి – అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది.? అసలు ఇందులో ‘సాహో’ ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

పాజిటివ్ పాయింట్స్:

హీరో ప్రభాస్ ఎప్పటిలానే నటనతో అదరగొట్టాడు. ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలలో తనదైన ఈజ్ ను చూపించాడు. ముఖ్యంగా రెండు షేడ్స్ లో అతడు అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ… అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. ఈ లీడ్ పెయిర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అవుతారని చెప్పవచ్చు. అటు గ్యాంగ్‌స్టర్స్ కు అధినేతగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. మిగిలిన నటులు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు.

నెగటివ్ పాయింట్స్:

ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి పుష్కలంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టుగా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ యాక్షన్ తో తెరకెక్కించాడు. తొలి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఆ ఫీల్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది. మొదట్లోనే గ్యాంగస్టర్‌ లీడర్‌ రాయ్‌ చనిపోవడంతో ఈ సినిమా అండర్‌ వరల్డ్‌ వారసత్వం గురించే అని అర్థమవుతుంది. కానీ అటు కథ, కథనంలో కొత్తదనం లేకపోవడం ఈ చిత్రానికి కొంత నెగటివ్ అని చెప్పాలి. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. విలన్ చుంకీ పాండేకు తప్ప వేరే ఎవ్వరికీ సరిగ్గా స్క్రీన్ ప్రెజన్స్ లేకపోవడం, స్క్రీన్ ప్లే, డైలాగులు నేటివిటీకి దూరంగా ఉండడం సినిమాకు మరో మైనస్.

విశ్లేషణ:

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు మాదిరిగానే ‘సాహో’లో కావాల్సినంత స్టఫ్ ఉంది. ప్రభాస్ నటన, లుక్స్ అదిరిపోయాయి. కొన్ని సన్నివేశాలలో అయితే హాలీవుడ్ హీరోను తలపిస్తాడు. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి ప్రభాస్ వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక చివరి 30 నిమిషాలు సినిమాను ప్లస్.  నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. నేపధ్య సంగీతం మాత్రం గిబ్రాన్ అదరగొట్టాడు. మాడీ అందించిన ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అయితే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేసినంత ఈ సినిమాలో ఉండదు. సో ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి పూర్తిగా ‘సాహో’ ఎంజాయ్ చేయండి.