Nandamuri Balakrishna : బాలయ్య సినిమా అందుకే ఆలస్యం అవుతుందట.. బిబి3 పై కొత్త గాసిప్..

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిబి3  టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Nandamuri Balakrishna : బాలయ్య సినిమా అందుకే ఆలస్యం అవుతుందట.. బిబి3 పై కొత్త గాసిప్..

Updated on: Jan 26, 2021 | 10:12 AM

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిబి3  టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహా, లెజండ్ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందుకోవడం ఖాయం అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.

కాగా ఈ మధ్య బోయపాటికి నిర్మాతకి పడటం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.  బడ్జెట్ విషయంలో ఏవో తేడాలు వచ్చాయని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య రెమ్యూనరేషన్ తో కలుపుకుని ఈ సినిమాను 45 కోట్ల బడ్జెట్ తో తీద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నారట. అయితే ప్రస్తుతం బడ్జెట్ అంతకు మించి అవుతుందని టాక్ నడుస్తోంది. అందువల్లే సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వుతూ వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా లో బాలీవుడ్ హీరో విలన్ గా నటిస్తాడని వార్తలు వస్తున్నప్పటికీ క్లారిటీ రాలేదు. మరో వైపు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని మరోటి అఘోరా అని ఫిలిం నగర్ టాక్. ఇక బాలయ్య సరసన ‘అఖిల్’ బ్యూటీ సయాషా సైగల్ నటిస్తోంది. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero NTR: కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్.. సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్..

 

Loading...
Unable to load recommendations.
Follow Us