నిహారిక పెళ్ళికి అందుకే హాజరుకాలేదు..అందువల్లే రాలేకపోయా..అసలు కారణం తెలిపిన రేణుదేశాయ్

|

Dec 17, 2020 | 12:13 AM

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైయ్యారు. ఈ వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

నిహారిక పెళ్ళికి అందుకే హాజరుకాలేదు..అందువల్లే రాలేకపోయా..అసలు కారణం తెలిపిన రేణుదేశాయ్
Follow us on

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ మొత్తం హాజరైయ్యారు. ఈ వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అన్న కూతురి పెళ్ళికి ఒక్కరోజు ముందే ఉదయ్ పూర్ కు చేఉకున్నారు పవన్. పవన్ తో పాటు పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యా లుకూడా ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్ళికి రేణుదేశాయ్ రాకపోవడం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. రేణుదేశాయ్ కు ఆహ్వానం అందలేదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే నిహారిక పెళ్లికి రాకపోవడం వెనక ఓ కారణం ఉందని తెలుస్తుంది. ఇటీవల రేణు దేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు రేణుదేశాయ్.  నిహారిక స్వయంగా రేణుదేశాయ్ ను పెళ్ళికి ఆహ్వానించిందని తెలుస్తుంది. కానీ షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే నిహారిక పెళ్ళికి హారాజారు కాలేక పోయారు రేణుదేశాయ్. రావాలని ఉన్నా కూడా కేవలం షూటింగ్ కారణంగానే నిహారిక పెళ్లికి రాలేదని రేణుదేశాయ్ తన సన్నిహితులతో చెప్పినట్టు తెలుస్తుంది. తాను రాలేకపోయిన తన పిల్లలను పంపారు రేణుదేశాయ్.