ఒక ఇంటివాడైన ‘రెమో’ దర్శకుడు

| Edited By:

Oct 26, 2020 | 4:45 PM

కోలీవుడ్‌లో మరో దర్శకుడు ఒక ఇంటివాడయ్యారు. దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌ పెళ్లి ఆశ అనే యువతితో ఇవాళ జరిగింది.

ఒక ఇంటివాడైన రెమో దర్శకుడు
Follow us on

Remo Director Marriage: కోలీవుడ్‌లో మరో దర్శకుడు ఒక ఇంటివాడయ్యారు. దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌ పెళ్లి ఆశ అనే యువతితో ఇవాళ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వివాహ వేడుకకు నటుడు శివ కార్తికేయన్ హాజరై వధూవరులకు తన అభినందనలు తెలిపారు.

కాగా అట్లీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన బక్కియరాజ్‌.. రెమోతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీ తమిళంలో మంచి విజయం సాధించింది. అంతేకాదు అదే పేరుతో టాలీవుడ్‌లో డబ్ అవ్వగా.. ఇక్కడా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ దర్శకుడు ఇప్పుడు కార్తి, రష్మిక మందనతో సుల్తాన్ అనే మూవీని తెరకెక్కించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక కార్తి కూడా తన సోషల్ మీడియాలో బక్కియరాజ్‌కి అభినందనలు తెలిపారు.

Read More:

కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం

నాచారం చోరీ కేసు.. నేపాలీ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు