Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..

టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో రెజీనా ఒకరు.నటనను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్ గా నే మిగిలిపోయింది రెజీనా. ఇక ఈ మధ్య సినిమాలు..

Regina Cassandra : నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా.. సినీ జర్నీ పై హీరోయిన్ రెజీనా..
regina-cassandra

Edited By:

Updated on: Jan 23, 2021 | 7:09 AM

Regina Cassandra : టాలీవుడ్లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో రెజీనా ఒకరు.నటనను నిరూపించుకునే సరైన సినిమా రాక మీడియం హీరోయిన్ గా నే మిగిలిపోయింది రెజీనా. ఇక ఈ మధ్య సినిమాలు కూడా తగ్గాయిపోయాయి. అడవి శేష్ నంటించిన ఎవరు సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. తాజగా రెజీనా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాలిడ్ సక్సెస్ కోసం రెజీనా ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. మంచి హిట్ కొట్టి తిరిగి రాణించాలని చూస్తుంది ఈ చిన్నది. తాజాగా ‘నేనేనా’ అనే సినిమా చేస్తుంది రెజీనా.  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రెజీనా మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎనిమిదేళ్లవుతోంది. ఈజర్నీలో ఎంతో నేర్చుకున్నా. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చాను కాబట్టి తొలినాళ్లలో ఇండస్ట్రీ గురించి సరైన అవగాహన ఉండేది కాదు.ఇక్కడ ఎన్నో నియమాలు, పరిధులు ఉంటాయి. చాలా మంది వాటినే అనుసరిస్తుంటారు. నా వ్యక్తిగత స్వేచ్ఛకు అడ్డుతగిలే ఏ నియమాన్ని నేను పాటించాను. నా సొంత నిర్ణయాలతోనే ముందుకుసాగుతా. కథ నచ్చితే వెంటనే సినిమాను ఓకే చేస్తాను .. ఎవరితోనే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం నాకునచ్చదు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా కెరీర్‌ను తీర్చిదిద్దుకున్నా… భవిషత్తులో కూడా ఇలానే ముందుకు సాగుతా అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

మరిన్ని ఇక్కడ చదవండి :

మరోసారి ట్రెండ్ అవుతున్న మహేష్ ‘సర్కారు వారి పాట’.. 100 మిలియన్ మార్క్ ను టార్గెట్ గా పెట్టుకున్న ఫ్యాన్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us