‘RED’ Movie Pre Release Event LIVE : ‘రెడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ద్విపాత్రాభినయంతో దుమ్మురేపేందుకు రెడీ అయ్యిన రామ్

|

Jan 12, 2021 | 7:24 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

RED Movie Pre Release Event LIVE : రెడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ద్విపాత్రాభినయంతో దుమ్మురేపేందుకు రెడీ అయ్యిన రామ్
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన తాజా చిత్రం రెడ్. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాళవికా శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ ఈ సినిమాలో కథానాయికలు గా కనిపించనున్నారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ఇది. ఇటీవల విడుదల చేసిన టీజర్, థియేట్రికల్ ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.  ఈ సినిమాను ఏకంగా ఏడూ బాషాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ లుక్ కు విశేషమైన స్పందన లాభించింది. రెడ్ కోసం మణిశర్మ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని టీవీ9 ప్రత్యక్షప్రసారం అందిస్తుంది..