యాంకర్‌ ప్రదీప్ బుల్లితెర బ్రేక్‌కి.. ఇదే అసలు కారణం..!!

| Edited By:

Nov 01, 2019 | 1:13 PM

బుల్లితెరలో యాంకర్ ప్రదీప్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అతనికి.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలు లేదు. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ కడుపుబ్బా.. నవ్వుతారు. అందులోనూ.. ప్రదీప్‌కి ఫీమేల్ ఫాలోయింగ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పటికప్పుడు జోక్స్ వేసి.. ఇతర యాంకర్‌లను కూడా ఇట్టే ఇరుకున పడేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని రోజుల నుంచి ఏ టీవీ షోలలోనూ కనిపించడం లేదు. అందులోనూ.. మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తోన్న ‘ఢీ’ షోలోకి కూడా రావటం […]

యాంకర్‌ ప్రదీప్ బుల్లితెర బ్రేక్‌కి.. ఇదే అసలు కారణం..!!
Follow us on

బుల్లితెరలో యాంకర్ ప్రదీప్‌కి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అతనికి.. ఫ్యాన్స్ ఫాలోయింగ్ మామూలు లేదు. అతని మాటలకు.. ఆటలకు.. ఫ్యాన్స్ కడుపుబ్బా.. నవ్వుతారు. అందులోనూ.. ప్రదీప్‌కి ఫీమేల్ ఫాలోయింగ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పటికప్పుడు జోక్స్ వేసి.. ఇతర యాంకర్‌లను కూడా ఇట్టే ఇరుకున పడేస్తాడు. అలాంటి ప్రదీప్ గత కొన్ని రోజుల నుంచి ఏ టీవీ షోలలోనూ కనిపించడం లేదు.

అందులోనూ.. మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తోన్న ‘ఢీ’ షోలోకి కూడా రావటం లేదు. దీంతో.. ప్రదీప్ కనిపిండం లేదేంటి.. అని ప్రేక్షకులందరూ.. ఆలోచనలో పడ్డారు. అయితే.. ప్రదీప్‌కి ఆరోగ్యం బాగోలేదని.. అందుకే అతను షూటింగ్స్‌ నుంచి విరామం తీసుకుంటున్నట్టుగా.. యాంకర్ రవి.. ఓ వీడియోలో చెప్పాడు. కాగా.. ప్రదీప్‌కి ఆరోగ్యం బాగాలేదు.. కానీ.. ఏమైందని ఆరా తీయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్.

అసలైన కారణం ఏంటంటే.. యాంకర్ ప్రదీప్ ఓ సినిమాలో నటిస్తున్నాడట. ఆ సినిమా షూటింగ్‌లో భాగంగా.. ప్రదీప్ కాలికి గాయమైందట. ఆగాయం పెద్దదిగా ఉండటంతో.. నడవలేని పరిస్థితి వచ్చిందని సమాచారం. అందుకే.. ఇటు ఈ సినిమా షూటింగ్‌కి.. అటు.. బుల్లితెర షోల నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.