ఇళయదళపతికి జోడిగా ఆ ఇద్దరు..?

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాలో తండ్రిగా, కొడుకుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న దశలోనే విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మొదట ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష, రకుల్ హీరోయిన్లుగా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే అదంతా వట్టి రూమర్స్ […]

ఇళయదళపతికి జోడిగా ఆ ఇద్దరు..?

Updated on: Jul 08, 2019 | 3:21 AM

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బిగిల్’. ఈ సినిమాలో తండ్రిగా, కొడుకుగా విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న దశలోనే విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

మొదట ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష, రకుల్ హీరోయిన్లుగా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే అదంతా వట్టి రూమర్స్ మాత్రమే అని తేలిపోయాయి. తాజా సమాచారం ప్రకారం విజయ్ సరసన రష్మిక మందన్నా, రాశి ఖన్నాలు జత కట్టనున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us