వైరల్‌గా రమ్యకృష్ణ చిన్నప్పటి ఫొటో.. ఎంత క్యూట్‌గా ఉన్నారో

| Edited By:

Jul 09, 2020 | 4:42 PM

శివగామి రమ్యకృష్ణ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. చిన్నప్పుడు తన క్లాస్‌మేట్స్‌తో తీసుకున్న ఓ ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్‌ చేసిన రమ్యకృష్ణ తనను గుర్తు పట్టండి అంటూ కామెంట్ పెట్టారు.

వైరల్‌గా రమ్యకృష్ణ చిన్నప్పటి ఫొటో.. ఎంత క్యూట్‌గా ఉన్నారో
Follow us on

శివగామి రమ్యకృష్ణ ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. చిన్నప్పుడు తన క్లాస్‌మేట్స్‌తో తీసుకున్న ఓ ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో షేర్‌ చేసిన రమ్యకృష్ణ తనను గుర్తు పట్టండి అంటూ కామెంట్ పెట్టారు. దానికి పలువురు తమ సమాధానాలను చెప్పారు. ఆ తరువాత తాను ఎక్కడున్నానో చెబుతూ మార్క్ చేసిన అదే ఫొటోను రమ్యకృష్ణ షేర్ చేశారు. కాగా ఈ ఫొటోలో రెండు జళ్లు, కంటి అద్దాలతో రమ్యకృష్ణ చాలా అమాయకంగా కనిపిస్తూ ఉండగా.. ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కాగా సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న రమ్యకృష్ణ ప్రస్తుతం తెలుగులో రంగ మార్తాండలో.. తమిళ్‌లో ఉయర్నథ మనిథన్‌, పార్టీ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు గౌతమ్‌ మీనన్ దర్శకత్వంలో క్వీన్ సీక్వెల్‌లోనూ రమ్యకృష్ణ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.