పవర్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

| Edited By:

Feb 25, 2019 | 11:47 AM

ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్విట్ చేశారు. పోతులూరి వీరబ్రహ్మం గారు పవన్ గురించి తన చెవిలో ఒక విషయాన్ని చెప్పారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీకి సీఎం అవుతాడు. ఒకవేళ గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు. […]

పవర్ స్టార్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
Follow us on

ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సారి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఓ ఆసక్తికర ట్విట్ చేశారు. పోతులూరి వీరబ్రహ్మం గారు పవన్ గురించి తన చెవిలో ఒక విషయాన్ని చెప్పారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీకి సీఎం అవుతాడు. ఒకవేళ గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడవుతాడు. తథాస్తూ అంటూ ట్విట్ చేశారు.

పవన్ కల్యాణ్ ను సీఎం చంద్రబాబు అలవాటు ప్రకారం వాడుకుని వెన్నుపోటు పొడిచారని… దీనికి ప్రతీకారంగా రానున్న ఎన్నికల్లో చంద్రబాబును పవన్ కల్యాణ్ నిజాయతీతో ముందుపోటు పొడుస్తాడని… పవన్ కల్యాణ్ పవర్ మీద తనకు అత్యంత మెగా నమ్మకం ఉందని వర్మ చెప్పారు.