పాక్ ప్రధానికి వర్మ ఘాటు కౌంటర్

| Edited By:

Feb 21, 2019 | 6:39 AM

పుల్వామా ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డారు వర్మ. ప్రియమైన ఇమ్రాన్ ఖాన్ అంటూ మొదలు పెట్టిన వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశారు. సమస్యలు ఒక్క మాటతో పరిష్కారమైతే.. మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అంటూ వర్మ కామెంట్ చేశారు. Dear Prime Minister @ImranKhanPTI If […]

పాక్ ప్రధానికి వర్మ ఘాటు కౌంటర్
Follow us on

పుల్వామా ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై మండిపడ్డారు వర్మ.

ప్రియమైన ఇమ్రాన్ ఖాన్ అంటూ మొదలు పెట్టిన వర్మ తనదైన రీతిలో సెటైర్లు వేశారు. సమస్యలు ఒక్క మాటతో పరిష్కారమైతే.. మీకు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అంటూ వర్మ కామెంట్ చేశారు.


అంతటితో ఆగకుండా ‘‘ఒసామా లాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని అమెరికాకు తెలుస్తుంది. కానీ మీకు తెలియదా’’ అని ఇమ్రాన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాగా వర్మ కామెంట్లకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇది వర్మ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

‘‘జైషే ఈ మహ్మద్, లష్కర్ ఈ తోయిబా, తాలిబన్, ఆల్‌ఖైదా ఇవన్నీ మీ ప్లే స్టేషన్‌లు అని నాకు ఎవరూ చెప్పలేదు. కానీ ‘వాటిని ద్వేషిస్తున్నాను’ అని మీరు చెప్పగా ఒక్కసారి కూడా వినలేదు’’ అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు.


‘‘జైషే ఈ మహ్మద్, లష్కర్ ఈ తోయిబా, తాలిబన్, ఆల్‌ఖైదా అవన్నీ మీ బంతులు.. వాటిని పాకిస్థాన్ బౌండరీస్ దాటించి ఇండియాపై వేస్తున్నారని నేను విన్నాను. మీరు బాంబ్‌లను క్రికెట్‌ బంతులనుకుంటున్నారా..? చెప్పండి సర్.. మమ్మల్ని అక్షరాస్యులను చేయండి సర్’’ అంటూ వర్మ కామెంట్లు చేశారు.