Ram Charan : ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌తో మెగాపవర్ స్టార్ సినిమా ఉండనుందా.. హాట్ టాపిక్‌‌‌‌గా చరణ్ నెక్స్ట్ సినిమా..

వరుస విజయాలతో  దూసుకుపోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ గా ఉన్నాడు. వెంకటేష్ , వరుణ్..

Ram Charan : ఆ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌‌‌తో మెగాపవర్ స్టార్ సినిమా ఉండనుందా.. హాట్ టాపిక్‌‌‌‌గా చరణ్ నెక్స్ట్ సినిమా..

Updated on: Jan 25, 2021 | 7:16 AM

Ram Charan : వరుస విజయాలతో  దూసుకుపోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించే పనిలో బిజీ గా ఉన్నాడు. వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ ఎవరితో సినిమా చేస్తారన్నది ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్.

టాలీవుడ్ టాక్ ప్రకారం అనిల్ నెక్స్ట్ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉంటుందని అంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో కూడా అడుగు పెట్టాడు చరణ్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ మేనేజర్ ప్రవీణ్ ఇటీవల క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడిని కలిసినట్టు సమాచారం. అనీల్ రావిపూడి శ్రీవిష్ణు నటిస్తున్న ‘గాలి సంపత్’ సినిమాను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మేనేజర్ అనిల్ ను కలిశాడట. ఈ నేపథ్యంలో చరణ్ తో అనిల్ సినిమా ఉంటుందని ఫిలింనగర్లో జోరుగా ప్రచారం సాగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Youtube Actress: డ్రైవర్‌ తనను అసభ్యంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి..

Loading...
Unable to load recommendations.
Follow Us