సీతను కలిసిన రామ్.. లుక్ అదుర్స్

| Edited By:

Aug 02, 2019 | 11:37 AM

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాణీ ‘వినయ విధేయ రామ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పరాజయమైనప్పటికీ.. వీరిద్దరి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక మూవీ షూటింగ్‌లో చెర్రీతో కియారాకు మంచి స్నేహం ఏర్పడింది. దీంతో ఇటీవల ఏదో పని మీద ముంబయికి వెళ్లిన చరణ్.. అక్కడ కియారాను కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫొటోలు వారిద్దరు బ్లాక్ డ్రెస్‌లో దర్శనమివ్వగా.. […]

సీతను కలిసిన రామ్.. లుక్ అదుర్స్
Follow us on

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాణీ ‘వినయ విధేయ రామ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ పరాజయమైనప్పటికీ.. వీరిద్దరి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక మూవీ షూటింగ్‌లో చెర్రీతో కియారాకు మంచి స్నేహం ఏర్పడింది. దీంతో ఇటీవల ఏదో పని మీద ముంబయికి వెళ్లిన చరణ్.. అక్కడ కియారాను కలిశాడు. ఈ సందర్భంగా వారిద్దరు తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఫొటోలు వారిద్దరు బ్లాక్ డ్రెస్‌లో దర్శనమివ్వగా.. మీసాలతో చెర్రీ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కాగా ఇటీవలే కియారా తన పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఈ ఏడాది కబీర్ సింగ్‌తో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.