Charan, Pawan Multistarrer: బాబాయ్ అబ్బాయ్‌లతో మెగా మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్న శంకర్..?

మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి కానీ. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లు కలిసి గానీ సినిమాలోను కనిపించలేదు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ లు ఒకే స్క్రీన్ ను పంచుకోనున్నారనే టాక్...

Charan, Pawan Multistarrer:  బాబాయ్ అబ్బాయ్‌లతో మెగా మల్టీ స్టారర్ మూవీకి రంగం సిద్ధం చేస్తున్న శంకర్..?

Updated on: Jan 19, 2021 | 3:50 PM

Charan, Pawan Multistarrer: టాలీవుడ్‌లో గత కొంత కాలంగా మళ్ళీ మల్టీస్టారర్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. క్రేజీ ప్రాజెక్ట్ లో స్టార్ హీరోలు నటిస్తూ.. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. సూపర్ హిట్ అందుకుంటున్నారు. అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మెగా బ్రదర్ నాగబాబు కలిసి నటించిన సినిమాలు తప్ప ఇటీవల మెగా హీరోలు ఓకే స్క్రీన్‌ని షేర్ చేసుకుంది లేదు. చిరంజీవి శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లో పవన్ చిన్న పాత్రలో కనిపించి అలరిస్తే.. ఖైదీ నెంబర్ 150లో రామ్ చరణ్ తండ్రితో స్టెప్స్ వేశాడు. ఇక చిరంజీవి కూడా చరణ్ మగధీర, బ్రూస్‌లీ వంటి సినిమాల్లో మెరుపులా మెరిసి ఆ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చాడు. తాజాగా చరణ్ ఆచార్య మూవీలో సిద్ధగా నటిస్తున్నాడు.

అంతేకాని మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి కానీ. పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ లు కలిసి గానీ సినిమాలోను కనిపించలేదు. తాజాగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ లు ఒకే స్క్రీన్ ను పంచుకోనున్నారనే టాక్ వినిపిస్తోంది. బాబాయ్ అబ్బాయ్ లు నటించే సినిమాను దక్షిణాది అగ్రశ్రేణి దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్, చరణ్‌లతో స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారని, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు కూడా సిద్ధమైందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో చరణ్ హీరో కాగా, పవన్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. పవన్ ఒకసారి ఫైనల్ వెర్షన్ స్క్రిప్టు చదివి ఓకే చెబితే వచ్చే ఏడాదే ఈ సినిమా పట్టాలెక్కుతుందట. గ్రాఫిక్స్ నేపథ్యంలో కాకుండా 1990ల్లో శంకర్ తీసిన ఎమోషనల్ కంటెంట్ బేస్డ్ సినిమాల తరహాలో ఇది రూపొందనుందట. ఈ సినిమా కోసమే చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరో సినిమాకు ఒకే చెప్పలేదని టాక్.. మరి ఈ వార్తలే కనుక నిజమైతే.. సౌత్ ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తెరకెక్కనున్న భారీ మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా నిలుస్తుంది.

గతంలో కూడా చిరంజీవి , పవన్ కళ్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ మల్టీస్టార్ సినిమా అంటూ వార్తలు వినిపించాయి. మెగా ఫ్యాన్స్ లో సందడి నెలకొంది. కానీ ఆ సినిమా వార్తలకే పరిమితమయ్యింది. సో పవన్ కళ్యాణ్ అన్నతో కాకపోయినా తనయుడితో కలిసి నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: కామన్ పాయింట్ తో పోటీపడుతున్న వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ..గని వర్సెస్ లైగర్

Loading...
Unable to load recommendations.
Follow Us