‘ఇండియన్ 2’లోకి రకుల్ ఎంట్రీ.. రోల్ ఏంటంటే..!

| Edited By:

Aug 12, 2019 | 9:35 PM

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికి తాజాగా మరోసారి తెరతీశారు దర్శకనిర్మాతలు. ఆ మధ్యన ఎప్పుడో ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. తాజాగా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. రాజమండ్రిలో ఈ మూవీ తాజా షెడ్యూల్‌ను జరుపుకుంటుండగా.. ఇందులో ఢిల్లీ […]

‘ఇండియన్ 2’లోకి రకుల్ ఎంట్రీ.. రోల్ ఏంటంటే..!
Follow us on

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ఇండియన్ 2. ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ప్రారంభం నుంచి ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అంతేకాదు ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్లు పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటికి తాజాగా మరోసారి తెరతీశారు దర్శకనిర్మాతలు. ఆ మధ్యన ఎప్పుడో ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి కాగా.. తాజాగా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. రాజమండ్రిలో ఈ మూవీ తాజా షెడ్యూల్‌ను జరుపుకుంటుండగా.. ఇందులో ఢిల్లీ బ్యూటీ రకుల్ జాయిన్ అయింది.

ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇండియన్ 2 బిగిన్స్ అంటూ ఓ ఫొటో తీసుకున్న రకుల్.. దాన్ని ఇన్‌స్టా స్టేటస్‌లో షేర్ చేసుకుంది. కాగా ఈ మూవీలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్ సరసన రకుల్ కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు. 1996లో వచ్చి భారీ విజయం సాధించిన ఇండియన్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.