ఆర్‌ఆర్‌ఆర్‌: ఆ ఆలోచన రాజమౌళికి లేదట!

| Edited By:

Aug 18, 2020 | 6:24 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షన్ కధాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా

ఆర్‌ఆర్‌ఆర్‌: ఆ ఆలోచన రాజమౌళికి లేదట!
Follow us on

Rajamouli RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్ఆర్‌. నిజ జీవిత పాత్రల ఆధారంగా ఫిక్షన్ కధాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపించనున్నారు. ఇక ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాను ఎంపిక చేసుకున్నారు జక్కన్న.

అయితే సుశాంత్ మృతి తరువాత పరిస్థితులు మారిపోయాయి. సుశాంత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారిలో అలియా భట్ కూడా ఒకరు. దీంతో ఆమెపై చాలా నెగిటివిటీ పెరిగింది. ఈ నెగిటివిటీని ఇటీవల ఆమె హీరోయిన్‌గా నటించిన సడక్‌ 2 ట్రైలర్‌పై చూపించారు కొంతమంది. సడక్ 2 ట్రైలర్‌కి అత్యధిక డిస్‌లైక్‌లు రాగా.. ప్రపంచంలోనే ఎక్కువ డిస్‌లైక్‌లు వచ్చిన వీడియోల్లో ఇది మూడు స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో రాజమౌళి ఆలోచనలో పడ్డట్లు ఆ మధ్యన పుకార్లు వినిపించాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆమె పాత్రలో మరొకరిని పెట్టే ఆలోచనలో జక్కన్న లేనట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు అలియానే న్యాయం చేయగలదని బలంగా నమ్ముతోన్న రాజమౌళి, వేరే వారిని పెట్టుకొనే ఆలోచనలో లేనట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్ సమయానికి ఈ వివాదం కాస్త సద్దుమణుగుతుందని దర్శకధీరుడు భావిస్తున్నట్లు టాక్‌. చూడాలి మరి పరిస్థితులు ఎలా మారబోతున్నాయో.

Read More:

సెప్టెంబర్ నుంచి ఏపీలో టూరిస్ట్‌లకు అనుమతి

తూత్తుకుడిలో ఎన్‌కౌంటర్‌.. రౌడీ షీటర్ మృతి