Radhe Shyam: ప్రేరణగా పూజా హెగ్డే.. అదరగొడుతున్న లుక్‌

| Edited By:

Oct 13, 2020 | 11:11 AM

ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇవాళ 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రభాస్

Radhe Shyam: ప్రేరణగా పూజా హెగ్డే.. అదరగొడుతున్న లుక్‌
Follow us on

Pooja Hegde as Prerana: ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇవాళ 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రభాస్ ‘రాధేశ్యామ్’‌ యూనిట్ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇందులో పూజా, ప్రేరణ అనే పాత్రలో నటిస్తుండగా.. యూరప్ దేశాల వస్త్రాధారణతో, అందమైన నవ్వుతో తెగ ఆకట్టుకుంటోంది. కాగా పీరియాడిక్ రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రాధేశ్యామ్‌ తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్, పూజా హెగ్డే తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, మురళీ శర్మ, కునాల్ రాయ్ కపూర్, ఎయిర్‌టెల్‌ భామ శాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ ఏడాది చివరిలోపు ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారు. కాగా పాన్ ఇండియా చిత్రంగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని గోపికృష్ణ బ్యానర్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీపై ఇటు అభిమానులతో పాటు అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read More:

21న విజయవాడకు జగన్.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 1,708 కొత్త కేసులు.. 5 మరణాలు