భర్త ఆల్బమ్‌లో ప్రియాంక.. ఆకట్టుకుంటోన్న వీడియో

| Edited By:

Mar 02, 2019 | 7:54 AM

గతేడాది వివాహం చేసుకొని ఒక్కటైన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మొదటిసారిగా కలిసి నటించారు. జోనాస్ బ్రదర్స్ రూపొందించిన సకర్ అనే వీడియో సాంగ్‌‌లో నిక్, ప్రియాంక కలిసి ఆడిపాడారు. వారి భార్యలతో కలిసి జోనాస్ బ్రదర్స్ రూపొందించిన ఈ వీడియో ఇటీవల విడుదల అవ్వగా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియాంక.. తొలిసారి మేమందరం కలిసి నటించాం. షూటింగ్ మొత్తం ఫన్ ఫ్యామిలీ ఎఫైర్‌లా సాగింది. జోనాస్ సోదరులు వారి […]

భర్త ఆల్బమ్‌లో ప్రియాంక.. ఆకట్టుకుంటోన్న వీడియో
Follow us on

గతేడాది వివాహం చేసుకొని ఒక్కటైన ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ మొదటిసారిగా కలిసి నటించారు. జోనాస్ బ్రదర్స్ రూపొందించిన సకర్ అనే వీడియో సాంగ్‌‌లో నిక్, ప్రియాంక కలిసి ఆడిపాడారు. వారి భార్యలతో కలిసి జోనాస్ బ్రదర్స్ రూపొందించిన ఈ వీడియో ఇటీవల విడుదల అవ్వగా అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియాంక.. తొలిసారి మేమందరం కలిసి నటించాం. షూటింగ్ మొత్తం ఫన్ ఫ్యామిలీ ఎఫైర్‌లా సాగింది. జోనాస్ సోదరులు వారి భార్యలు బాగా ఎంజాయ్ చేశారు. నిన్ను చూసి గర్వపడుతున్నా నిక్ అంటూ కామెంట్ పెట్టింది. కాగా ప్రస్తుతం ప్రియాంక ది స్కై ఈజ్ పింక్ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.