Kalki 2898 AD 3rd Day Collections: కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే..

|

Jun 30, 2024 | 12:35 PM

రెండో రోజుతో పోలిస్తే శనివారం వసూళ్లు 50% పెరిగాయి. శనివారం వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగాయి. ఇక ఈరోజు ఆదివారం కల్కి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. శనివారం వసూళ్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, ఆదివారం దాదాపు 100 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Kalki 2898 AD 3rd Day Collections: కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ కలెక్షన్స్.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే..
Prabhas Kalki 2898 Ad Movie
Follow us on

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం మంచి వసూళ్లు రాబడుతుంది కల్కి 2898 ఏడి. జూన్ 27న విడుదలైన ఈ మూవీ గత మూడు రోజులుగా భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ముఖ్యంగా రెండో రోజు వసూళ్లను అధిగమించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ మూవీ తొలి రోజే రూ.191.5 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండు కూడా ఈ మూవీ భారీ వసూల్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఇండియాలోనే రూ.75 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.298 కోట్లు వసూలు చేసింది. అంచనాల ప్రకారం మూడవ రోజుకు ఇండియాలోనే రూ.200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది ఈ మూవీ. నివేదికల ప్రకారం నిన్న ఒక్క రోజే రూ.67.10 కోట్లు రాబట్టింది. మూడు రోజులలో ఇండియాలో మొత్తంగా రూ.220 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

రెండో రోజుతో పోలిస్తే శనివారం వసూళ్లు 50% పెరిగాయి. శనివారం వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగాయి. ఇక ఈరోజు ఆదివారం కల్కి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. శనివారం వసూళ్ల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని, ఆదివారం దాదాపు 100 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఆదివారం నాటికి రూ.500 కోట్లను మార్క్ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఒక్కవారంలోనే ఐదు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రానున్నయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. భారతీయ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రానికి అడియన్స్ ఫిదా అఏవుతున్నారు.

వైజయంతీ మూవీస్ ద్వారా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘కల్కి 2898 AD’ దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమా. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.