Saaho Trailer: ప్రభాస్ క్రేజ్‌కు.. యూట్యూబ్ బ్లాస్ట్!

|

Aug 12, 2019 | 2:17 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతూ 51 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ నెల […]

Saaho Trailer: ప్రభాస్ క్రేజ్‌కు.. యూట్యూబ్ బ్లాస్ట్!
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతూ 51 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించి వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ నెల 30న విడుదల కానుంది. అండర్ కవర్ కాప్‌గా ప్రభాస్ కనిపించనుండగా.. శ్రద్ధా కపూర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తోంది. జాకీ ష్రాఫ్, మురళి శర్మ, చుంకీ పాండే, అరుణ్ విజయ్, మహేష్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 24 గంటల్లోనే రికార్డులను తుడిచి పెట్టేసిన ఈ ట్రైలర్.. మరెన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.