ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ‘సాహో’ సంచలనం… ప్రభాస్ రేంజ్ అదరహో!

| Edited By:

Aug 17, 2019 | 6:50 PM

తెలుగు ఇండస్ట్రీలో బడ్జెట్ లెక్కలనే కాదు.. బాక్సాఫీస్ రూపు రేఖలను మార్చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ ఒక్కడే. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవిని దాటాలంటే కష్టమే. కానీ ఇప్పుడు ప్రభాస్ ఆ పని చేస్తున్నాడు. ఈయన నటించిన సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మరోవైపు సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరక్కపోవడం గమనార్హం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే తెలుగులో […]

ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సాహో సంచలనం... ప్రభాస్ రేంజ్ అదరహో!
Follow us on

తెలుగు ఇండస్ట్రీలో బడ్జెట్ లెక్కలనే కాదు.. బాక్సాఫీస్ రూపు రేఖలను మార్చేసిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ ఒక్కడే. ఇప్పటికీ ఎప్పటికీ చిరంజీవిని దాటాలంటే కష్టమే. కానీ ఇప్పుడు ప్రభాస్ ఆ పని చేస్తున్నాడు. ఈయన నటించిన సాహో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. మరోవైపు సైరా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరక్కపోవడం గమనార్హం. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చిరంజీవి సినిమా అంటే తెలుగులో తిరుగులేదు. ఈయన సినిమాల కోసం బయ్యర్లు ఎగబడుతుంటారు. కానీ బయటి ఇండస్ట్రీల్లో మాత్రం చిరంజీవి హీరో మాత్రమే.. స్టార్ కాదు.

అయితే… ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియన్ వైడ్ ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. రెండు భాగాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఆ ప్రభావం సాహోపై కనిపిస్తుంది. ఈ చిత్ర బిజినెస్ ఏకంగా 340 కోట్ల వరకు జరిగిందంటే ప్రభాస్ రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో హిందీ మాత్రమే 100 కోట్లకు పైగా ఉంది. కానీ సైరా మాత్రం 40 కోట్ల స్థాయిలోనే ఆగిపోయింది. సైరా 250 కోట్ల వరకు బిజినెస్ చేయాలని చరణ్ ప్రయత్నిస్తున్నా కష్టమే అనిపిస్తుంది. కాగా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.