SIIMA Awards: సైమాకు నామినేట్ అయిన ‘పిండం’.. ఏ విభాగంలో అంటే..

|

Jul 20, 2024 | 2:29 PM

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సైమా అవార్డులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 14,15 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ అవార్డులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ చిన్న సినిమా నామినేట్ కావడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు పిండం...

SIIMA Awards: సైమాకు నామినేట్ అయిన పిండం.. ఏ విభాగంలో అంటే..
Pindam Movie
Follow us on

సినిమా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులో సైమా ఒకటి. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ పేరుతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన టెక్నీషియన్స్‌ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రారంభించిన విషయం తెలిసిందే. 12 ఏళ్లుగా విజయవంతంగా ఈ పురస్కారాల వేడుకలు జరుగుతున్నాయి. ఈ అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తుంటారు.

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సైమా అవార్డులకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ 14,15 తేదీల్లో దుబాయ్‌ వేదికగా ఈ వేడుక జరగనుంది. దీంతో ఇప్పటికే ఈ అవార్డులు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను ‘సైమా’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా ఓ చిన్న సినిమా నామినేట్ కావడం విశేషం. ఆ సినిమా మరేదో కాదు పిండం. 2023 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను తెగ భయపెట్టేసిందని చెప్పాలి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ పిండం మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ హారర్‌ చిత్రానికి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సైమా అవార్డుల్లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందింది. బెస్ట్‌ డెబ్యూ ప్రొడ్యూసర్‌ విభాగంలో ఈ సినిమా ఎంపికైనట్లు సైమా తెలిపింది. దీనిపై పిండం చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. సైమాకు సినిమా ఎంపిక కావడంపై మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణ బాధ్యతలు వహించిన విషయం తెలిసిందే.

సినిమాల్లోకి రాకముందు యశ్వంత్‌ దగ్గుబాటి అమెరికాలోని కార్పొరేట్ రంగంలో పేరు తెచ్చుకున్నారు. అక్కడే దర్శకుడు సాయికిరణ్‌ను కలిసిన యశ్వంత్.. పిండం సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమా తీసే సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని చిత్రాన్ని పూర్తి చేసినట్లు నిర్మాత చెప్పుకొచ్చారు. మరి పిండం చిత్రానికి ఈ అవార్డు లభిస్తుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే పిండంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిన దర్‌శకుడు సాయి కిరణ్ మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కళాహి మీడియా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…