Pawan Kalyan : షూటింగ్ మొదలు పెట్టిన పవన్.. బుల్లెట్ పైన పవర్ స్టార్.. ఆకట్టుకుంటున్న వీడియో

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్ అయిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, పవర్‌ హౌస్‌ రానా దగ్గుబాటి కలిసి సినిమా చేస్తున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పమ్‌ కోషియమ్

Pawan Kalyan : షూటింగ్ మొదలు పెట్టిన పవన్..  బుల్లెట్ పైన పవర్ స్టార్.. ఆకట్టుకుంటున్న వీడియో

Updated on: Jan 26, 2021 | 1:13 PM

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్ అయిన విషయం తెలిసిందే. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, పవర్‌ హౌస్‌ రానా దగ్గుబాటి కలిసి సినిమా చేస్తున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పమ్‌ కోషియమ్‌ రీమేక్‌ కోసం ఈ క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు డైరెక్టర్ సాగర్ కే చంద్ర. పృథ్వీరాజ్‌, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక తెలుగు లో ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంచిన్న అప్ డేట్ ఇస్తూ.. ఓ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. పవన్ బైక్ పై ఓ లాడ్జిలోకి వెళ్తున్న  సీన్స్ ని షూట్ చేసినట్లు ఈ వీడియోలో చూపించారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్.

Follow Us