Vishwak Sen Cult OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ కల్ట్.. ఎక్కడ చూడొచ్చంటే

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా #కల్ట్. ఈ సినిమా అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Vishwak Sen Cult OTT: ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్ సేన్ కల్ట్.. ఎక్కడ చూడొచ్చంటే
Cult Movie

Updated on: Nov 20, 2026 | 8:54 AM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హీరోగా నటించడమే కాకుండా విశ్వక్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి రూపొందించిన సినిమా #కల్ట్. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్పందనను సొంతం చేసుకోలేకపోయింది. విడుదలైన తొలి రోజే మిక్స్‌డ్ టాక్‌ను ఎదుర్కొన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన సుమారు 20 రోజులకే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. థియేటర్లలో నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

ఈ సినిమా కథ గోవాలో సాగుతుంది. అక్కడి హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేకంగా #కల్ట్ అనే పబ్‌ను ఎంచుకుంటాడు. ఈ పార్టీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు కూడా అక్కడికి చేరుకుంటారు. మొదట్లో అంతా సాధారణంగానే కనిపించినా.. కొద్దిసేపటికే పార్టీ వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారుతుంది. పబ్‌లోని స్క్రీన్‌పై కనిపించే ఓ వింత బొమ్మ అక్కడున్న వారితో ప్రమాదకరమైన ఆటలు ఆడిస్తుంది. ఆ గేమ్స్‌లో ఓడిపోయిన వారికి మరణమే శిక్షగా మారుతుంది. దీంతో పార్టీలో పాల్గొన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

మరోవైపు డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తాడు. అసలు అతడు ఆ పబ్‌కు ఎందుకు వచ్చాడు ? అక్కడ జరుగుతున్న భయానక పరిణామాల వెనుక ఉన్నది ఎవరు.? ఆ వింత బొమ్మను నియంత్రిస్తున్న వ్యక్తి ఎవరు ? ప్రాణాంతకమైన ఆటల నుంచి యువకులు బయటపడగలిగారా? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే సినిమా మిగతా కథ. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన కల్ట్ ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సరికొత్త కాన్సెప్టులు, సస్పెన్స్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఎలా అనిపిస్తుందో వేచి చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us