Telugu News Entertainment Ott Upcoming Movies And Web Series To Stream On Various OTT Platforms In November Last Week Telugu Cinema News
OTT Movies: ఈ వారం ఓటీటీల్లో బ్లాక్ బస్టర్ సినిమాలు, సిరీస్‌లు.. విజయ్ ‘లియో’తో సహా ఫుల్ లిస్ట్ ఇదే
వైష్ణవ్ తేజ్, శ్రీలీల ఆది కేశవ, కోటబొమ్మాళి పీఎస్, ధృవనక్షత్రం వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలో కూడా దాదాపు 20కు పైగా సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌లో చాలామంది దృష్టి విజయ్ దళపతి లియో సినిమాపైనే ఉంది.
ప్రపంచ కప్ ఫీవర్ ముగిసింది. దీంతో మళ్లీ సినిమాలు వరుసగా థియేటర్లలోకి అడుగుపెడుతున్నాయి. అలా ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయనున్నాయి. వైష్ణవ్ తేజ్, శ్రీలీల ఆది కేశవ, కోటబొమ్మాళి పీఎస్, ధృవనక్షత్రం వంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదలవుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలో కూడా దాదాపు 20కు పైగా సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌కి రెడీ అయిపోయాయి. ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌లో చాలామంది దృష్టి విజయ్ దళపతి లియో సినిమాపైనే ఉంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రానుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌ల్లో సంచలనం సృష్టించిన స్క్విడ్ గేమ్: ది ఛాలెంజ్ కూడా ఈ వారమే అందుబాటులోకి రానుంది. అలాగే ఆర్య ది విలేజ్ వెబ్ సిరీస్ కూడా ఆసక్త కలిగిస్తోంది. మరి వీటితో పాటు ఈ వారం పలు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.
నెట్‌ఫ్లిక్స్
స్టాంప్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 20
లియో (తెలుగు మూవీ) – నవంబరు 24
స్క‍్విడ్ గేమ్: ద ఛాలెంజ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – నవంబరు 22
మై డామెన్ (జపనీస్ వెబ్ సిరీస్) – నవంబరు 23
పులిమడ (మలయాళ మూవీ) – నవంబరు 23
లాస్ట్ కాల్ ఫర్ ఇస్తాంబుల్ (టర్కిష్ మూవీ) – నవంబరు 24
గ్రాన్ టరిష్మో (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 24
ద మెషీన్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 26
అమెజాన్ ప్రైమ్ వీడియో
ద విలేజ్ (తమిళ్ వెబ్ సిరీస్) – నవంబరు 24
ఎల్ఫ్ మీ (ఇటాలియన్ మూవీ) – నవంబరు 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
ఫర్గో: సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 21
చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ) – నవంబరు 23
జీ5
ద ఆమ్ ఆద్మీ ఫ్యామిలీ: సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 24
జియో సినిమా
ద గుడ్ ఓల్డ్ డేస్ (తెలుగు వెబ్ సిరీస్) – నవంబరు 23
బుక్ మై షో
ఒపెన్ హైమర్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 22
UFO స్వీడన్ (స్వీడిష్ సినిమా) – నవంబరు 24
సోనీ లివ్
చావెర్ (మలయాళ మూవీ) – నవంబరు 24
సతియా సోతనాయ్ (తమిళ సినిమా) – నవంబరు 24
ఆహా
అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిసన్ (యానిమల్ మూవీ టీమ్ ఎపిసోడ్) – నవంబరు 24
యాపిల్ ప్లస్ టీవీ
హన్నా వడ్డింగ్‌హమ్: హోమ్ ఫర్ క్రిస్మస్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 22